logo

పొలం పంచాయితీ

పొలం విషయంలో ఆరంభమైన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఇరు వర్గాలకు చెందిన వారు కత్తులు, రాడ్లు, కారం పొడితో దాడులు చేసుకోగా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని ఓబుళంపల్లె గ్రామానికి చెందిన షేక్‌ హుసేన్‌వలి, అతడి ముగ్గురు సోదరులకు తెలియ

Published : 27 Jan 2022 05:22 IST

కత్తులతో పరస్పర దాడులు

ఇద్దరి పరిస్థితి విషమం

చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

ఆళ్లగడ్డ గ్రామీణ, న్యూస్‌టుడే: పొలం విషయంలో ఆరంభమైన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఇరు వర్గాలకు చెందిన వారు కత్తులు, రాడ్లు, కారం పొడితో దాడులు చేసుకోగా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని ఓబుళంపల్లె గ్రామానికి చెందిన షేక్‌ హుసేన్‌వలి, అతడి ముగ్గురు సోదరులకు తెలియకుండా అదే గ్రామానికి చెందిన ముల్లా మాబుహుసేన్‌కు పొలం విక్రయించారు. ఈ విషయంలో కొనుగోలుదారులు, విక్రయదారుడి కుటుంబానికి మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. బుధవారం సాయంత్రం ఇరు వర్గీయులు పొలం వద్ద పంచాయతీ నిమిత్తం చేరుకున్నారు. అందులో ఒక వర్గం వారు ముందస్తుగా రాడ్లు, కత్తులు, కారం పొడితో దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. స్థానికులు 108లో క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ రాజేంద్ర, సీఐ చంద్రబాబునాయుడు, కృష్ణయ్య ఆసుప్రతికి చేరుకొని విచారణ చేపట్టారు. క్షతగాత్రుల్లో పులిచెర్ల మాబుహుశేన్‌, ఆరీఫ్‌, నదీంసాగారి హుశేన్‌సా పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సిఫారసు మేరకు నంద్యాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

పెద్దయమ్మనూరులో ..

పెద్దయమ్మనూరు(ఉయ్యాలవాడ) : మండలంలోని పెద్దయమ్మనూరులో బుధవారం రస్తా విషయంలో రెండు వర్గాల మధ్య మనస్పర్థలు ఘర్షణకు దారి తీశాయి. గ్రామానికి చెందిన దండెల మల్లికార్జునరెడ్డి, రూపనగుడి గ్రామానికి చెందిన ముసలిగాళ్ల ప్రసాద్‌, పుష్పరాజుతో కలిసి రస్తాకు అడ్డుగా గోడ కడుతున్నారు. అదే గ్రామానికి చెందిన దండెల పుల్లారెడ్డి, విజయ భాస్కరరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి అడ్డుకొన్నారు. దీంతో ఇరు వర్గీయులు మాటా మాటా పెంచుకుని వివాదానికి దిగారు. కోపోద్రిక్తులై ఇనుపరాడ్లు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో దండెల మల్లికార్జునరెడ్డి, ప్రసాద్‌, పుష్పరాజు తలకు బలమైన గాయాలయ్యాయి. ఎస్సై మల్లికార్జున గ్రామాన్ని సందర్శించి బాధితులను మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


గాయపడిన మల్లికార్జునరెడ్డి, పుష్పరాజు, ప్రసాద్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని