logo

తండ్రికి బాలుడి అప్పగింత

తెలంగాణ రాష్ట్రానికి చెందిన అనిల్‌ అనే బాలుడు తప్పిపోయి ఆదోని పట్టణంలో బుధవారం ప్రత్యక్షమయ్యాడు. సీఐ శ్రీరాములు తెలిపిన వివరాల మేరకు.. అనిల్‌ అనే బాలుడు ఆదోని ఆర్టీసీ బస్టాండులో తిరుగుతుండగా గుర్తించిన రెండో పట్టణ పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారించగా తనది తెలంగాణ రాష్ట్ర

Published : 27 Jan 2022 05:22 IST


బాలుడు అనిల్‌తో పోలీసులు

 

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : తెలంగాణ రాష్ట్రానికి చెందిన అనిల్‌ అనే బాలుడు తప్పిపోయి ఆదోని పట్టణంలో బుధవారం ప్రత్యక్షమయ్యాడు. సీఐ శ్రీరాములు తెలిపిన వివరాల మేరకు.. అనిల్‌ అనే బాలుడు ఆదోని ఆర్టీసీ బస్టాండులో తిరుగుతుండగా గుర్తించిన రెండో పట్టణ పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారించగా తనది తెలంగాణ రాష్ట్రమని పేర్కొనడంతో మరిన్ని వివరాలు ఆరాతీశారు. వనపర్తి మండలం నాగవరం గ్రామానికి చెందిన స్వామి, లక్ష్మి దంపతుల కుమారుడిగా తెలుసుకొని వారిని ఇక్కడికి రప్పించి బాలుడిని అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని