logo

ఘనంగా మారెమ్మవ్వ దేవర

ఆలూరు ఇందిరాగనర్‌ కాలనీలో వెలసిన మారెమ్మవ్వ దేవర బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే మహిళలు కుంబాలను తీసుకొచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మారెమ్మవ్వ మూల విరాట్టును వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. దాదాపు వందేళ్ల తర్వాత

Published : 27 Jan 2022 05:24 IST



అలంకరణలో మారెమ్మవ్వ

ఆలూరు, న్యూస్‌టుడే: ఆలూరు ఇందిరాగనర్‌ కాలనీలో వెలసిన మారెమ్మవ్వ దేవర బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే మహిళలు కుంబాలను తీసుకొచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మారెమ్మవ్వ మూల విరాట్టును వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. దాదాపు వందేళ్ల తర్వాత దేవర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఎమ్మెల్యే విరాళం : కోసిగి, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి రూ.1.10 లక్షల విలువ గల స్వర్ణ ఖడ్గం కోసం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బుధవారం నగదు అందజేసినట్లు ఆలయ ధర్మకర్తలు ఓం ప్రకాష్‌, రామస్వామి, విజయ్‌కుమార్‌, రామచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు డాక్టర్‌ గోపాల్‌, పూజారి గోవిందు, ముదగల ఆదెప్ప, బండారి శ్రీనివాసులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని