logo

వేతనాల కోసం రోడ్డెక్కిన విద్యుత్తు ఉద్యోగులు

గతంలో పలు సమస్యలపై విద్యుత్తు సంస్థలు, ప్రభుత్వాలపై పోరాటాలు చేశామని.. ప్రస్తుతం నెల నెలా విధులు నిర్వహించి జీతాలు ఇవ్వండి మహాప్రభో అని రోడ్లెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యుత్తు

Published : 13 May 2022 04:49 IST

విద్యుత్తు భవన్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులు, నాయకులు

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: గతంలో పలు సమస్యలపై విద్యుత్తు సంస్థలు, ప్రభుత్వాలపై పోరాటాలు చేశామని.. ప్రస్తుతం నెల నెలా విధులు నిర్వహించి జీతాలు ఇవ్వండి మహాప్రభో అని రోడ్లెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యుత్తు ఉద్యోగుల ఐకాస జిల్లా అధ్యక్షుడు గణేశ్‌, కార్యదర్శి రవీంద్రబాబు అన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నగరంలోని విద్యుత్తు భవన్‌ ఎదుట ఉద్యోగులతో కలిసి గురువారం నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. ఐకాస నాయకులు మాట్లాడుతూ విద్యుత్తు ఉద్యోగులకు నెలనెలా 1వ తేదీ క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మే 12వ తేదీ అయినా ఇంతవరకు బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నస్థాయి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సంస్థకు ఆదాయం వస్తున్నా జీతాలు చెల్లించకపోవడమేంటని ప్రశ్నించారు. వివిధ సంఘాల నాయకులు కృష్ణయ్య, విరూపాక్షి రెడ్డి, ఆనంద్‌దేవ్‌పాల్‌, ఉసేని, పెద్దయ్య, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని