logo

త్వరితగతిన నాడు-నేడు రెండోదశ పనులు

మన బడి నాడు-నేడు రెండో దశ పనులు సత్వరమే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డీఈవో రంగారెడ్డి, సర్వశిక్ష అభియాన్‌ పీవో డా.వేణుగోపాల్‌లతో కలిసి రెండో ద

Published : 19 May 2022 06:23 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.కోటేశ్వరావు, వేదికపై డీఈవో రంగారెడ్డి, సర్వశిక్ష అభియాన్‌ పీవో డా.వేణుగోపాల్‌ 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: మన బడి నాడు-నేడు రెండో దశ పనులు సత్వరమే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డీఈవో రంగారెడ్డి, సర్వశిక్ష అభియాన్‌ పీవో డా.వేణుగోపాల్‌లతో కలిసి రెండో దశ నాడు-నేడు కింద పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు.   రెండో దశలో రూ.311.87 కోట్లతో 685 పాఠశాలల్లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలన్నారు. 60 పాఠశాలలకు సంబంధించి రూ.15 కోట్లు తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో జమ చేశామన్నారు.  వెంటనే పనులను ప్రారంభించాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సంబంధిత పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో ప్రారంభించాలని ఎంఈవోలు, ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. వారాలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు.  నిధులు దుర్వినియోగం కాకుండా పాఠశాలల నిర్మాణం కోసం బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలన్నారు. మొదటి దశకు సంబంధించి 574 పాఠశాలల్లో పనులు చేపట్టగా ఇప్పటి వరకు 568 పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన ఆరు పాఠశాలల్లో మూడింటిలో  రంగులేయించే కార్యక్రమం పూర్తి చేయాలని ఎస్‌ఎస్‌ఏ పీవో వేణుగోపాల్‌ను ఆదేశించారు. నిడ్జూరు జడ్పీ, బి.క్యాంపు, కింగ్‌ మార్కెట్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో అవసరమైన నిధులు పూర్తిగా ఇచ్చినా ప్రాజెక్టు పూర్తి చేయనందున ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డీఈవో రంగారెడ్డిని ఆదేశించారు. ఎస్‌ఈ పాండురంగమూర్తి, డిప్యూటీ డీఈవోలు, ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని