logo

నేడు తెదేపా సభ

చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరంలో గురువారం    ఉదయం  10 గంటలకు కమ్మ సంఘం కల్యాణ మండపంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారని తెదేపా కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ నియ్జోకవర్గాల

Updated : 19 May 2022 06:26 IST

 హాజరుకానున్న పార్టీ అధినేత 
 కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు


ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మాట్లాడుతున్న సోమిశెట్టి, గౌరు దంపతులు 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరంలో గురువారం    ఉదయం  10 గంటలకు కమ్మ సంఘం కల్యాణ మండపంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారని తెదేపా కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ నియ్జోకవర్గాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, పాణ్యం తెదేపా బాధ్యురాలు గౌరు చరితారెడ్డి తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ విస్తృత స్థాయి సమావేశం అనంతరం డోన్‌కు వెళ్తారన్నారు. 
జలదుర్గం పసుపు మయం
డోన్, ప్యాపిలి, న్యూస్‌టుడే: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డోన్‌ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పట్టణంతో పాటు జలదుర్గంలో భారీ ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం 4.50 గంటలకు డోన్‌కు చేరుకుంటారు... ఐటీఐ కళాశాల ఎదుట ఉన్న ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రోడ్‌షో ప్రారంభం అవుతుందని నియోజకవర్గ ఇన్‌ఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డి తెలిపారు. డోన్‌ నుంచి కోట్లవారిపల్లె, గోసానిపల్లె, చింతలపేట, కొచ్చెర్వు మీదుగా జలదుర్గానికి వెళ్తారన్నారు. అక్కడ నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారన్నారు. సభకు వచ్చే నాయకులు, కార్యకర్తలకు భోజన వసతి ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యమైన నాయకులకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వాహనాల పార్కింగ్‌ సౌకర్యం కల్పించామన్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ రామలింగమయ్య తెలిపారు.


జలదుర్గంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ధర్మవరం సుబ్బారెడ్డి తదితరులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని