logo

ఒడ్డెక్కని వంతెన కష్టాలు

సరిహద్దులో వారధి అసంపూర్తిగా ఉండటంతో ప్రయాణికులు పడుతున్న అవస్థలివి. నందవరం మండలం నాలుగదిన్నె వద్ద రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వంతెన 2009లో భారీ వరదలకు తెగిపోయింది. రూ.39 కోట్లతో నిర్మించాలని 2012లో నిర్ణయించారు.

Published : 19 May 2022 06:23 IST


మెట్ల ద్వారా వంతెనపైకి వెళ్తున్న జనం

సరిహద్దులో వారధి అసంపూర్తిగా ఉండటంతో ప్రయాణికులు పడుతున్న అవస్థలివి. నందవరం మండలం నాలుగదిన్నె వద్ద రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వంతెన 2009లో భారీ వరదలకు తెగిపోయింది. రూ.39 కోట్లతో నిర్మించాలని 2012లో నిర్ణయించారు. 2016 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. తెలంగాణ వైపు నుంచి అనుమతులు రాకపోవడం... సామగ్రి, ఇతర ధరలు పెరగడంతో గుత్తేదారు అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. సగం వరకు వంతెన నిర్మించారు. దీంతో చేసేది లేక ప్రయాణికులు ఇనుప మెట్ల సాయంతో వంతెన పైకి చేరుకొని అక్కడి నుంచి సరిహద్దు దాటుతున్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని పులికల్‌లో దేవర ఉత్సవం ఉండడంతో జనం పెద్ద ఎత్తున తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మెట్లపై ఎక్కి వెళ్లారు  - న్యూస్‌టుడే, నందవరం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు