logo

మొదలైన వజ్రాన్వేషణ

ఇటీవల కురిసిన తొలకరి వర్షాలకు మూడు రోజులుగా మద్దికెర ప్రాంతంలో వజ్రాల అన్వేషణ మొదలైంది. మండలంలోని గ్రామాల్లో చినుకు రాలితే వజ్రాలు కనిపిస్తాయి. వాటికోసం ఈ ప్రాంతానికి అనేకమంది వస్తుంటారు. ఏళ్ల తరబడి ఇక్కడ ఈ తంతు సాగుతోంది. కొందరు ఉ

Published : 20 May 2022 06:22 IST


మదనంతపురం పొలాల్లో వజ్రాలు వెతుకుతున్న యువకులు

మద్దికెర, న్యూస్‌టుడే: ఇటీవల కురిసిన తొలకరి వర్షాలకు మూడు రోజులుగా మద్దికెర ప్రాంతంలో వజ్రాల అన్వేషణ మొదలైంది. మండలంలోని గ్రామాల్లో చినుకు రాలితే వజ్రాలు కనిపిస్తాయి. వాటికోసం ఈ ప్రాంతానికి అనేకమంది వస్తుంటారు. ఏళ్ల తరబడి ఇక్కడ ఈ తంతు సాగుతోంది. కొందరు ఉదయం వచ్చి సాయంత్రంలోగా తమ ప్రాంతాలకు, ఊళ్లకు చేరుకునేవారు కొందరైతే, వజ్రం దొరికే దాకా ఇక్కడే ఏదో చోట నివాసం ఉంటూ కాలం వెళ్లదీసేవారు మరికొందరు. ఉదయం పొలాల్లో ఉంటూ వజ్రాల వేటలో గడుపుతారు. రాత్రి వేళల్లో దేవాలయాలు, సత్రాల్లో ఆశ్రయం పొందుతూ కాలం గడుపుతున్నారు. పెరవలి, బసినేపల్లి, మదనంతపురం తదితర గ్రామాల్లో ఖరీఫ్‌ ఆరంభమయ్యేదాకా ఈ తంతు సాగుతూనే ఉంటుంది. మంగళ, బుధ, గురువారాల్లో వర్షాలు కురువడంతో భారీగా తరలివచ్చిన ప్రజలు పొలాలబాట పట్టారు. వజ్రం దొరికిన వారు కొందరు నేరుగా వ్యాపారులు ఇళ్లకు వెళ్లి అమ్ముతుంటారు. కొన్నిసార్లు గుట్టుచప్పుడు కాకుండా పొలాల్లో వజ్రాల వేలాలు జరుగుతాయి. వజ్రం లభించినా, అమ్మినా సమాచారం బయటకు పొక్కకుండా దొరికినవారు, వ్యాపారులు జాగ్రత్తలు తీసుకొంటారు.

జొన్నగిరిలో వజ్రం లభ్యం

తుగ్గలి, న్యూస్‌టుడే: జొన్నగిరిలో ఓ వ్యవసాయ కూలీకి గురువారం వజ్రం లభించింది. దాన్ని స్థానిక వ్యాపారి ఒకరు రూ.36 వేలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జొన్నగిరి, పగిడిరాయి, తుగ్గలి పొలాల్లో వజ్రాన్వేషణ ఊపందుకొంది. వజ్రాన్వేషకులు పొలాల్లోకి రాకుండా గట్ల వద్ద రైతులు కాపలా కాస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని