logo

ముగిసిన ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలు

కొవిడ్‌ నేపథ్యంలో చదువులకు ఆటంకం కలిగి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిపారు. ఉమ్మడి జిల్లాలో ఈనెల 6వ తేదీన ఇంటర్‌ మొదటి ఏడాది, 7వ తేదీన ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలు ప్రారంభమయ్యాయి. 268 కళాశాలల్లో చదు

Published : 20 May 2022 06:22 IST

కర్నూలు (విద్యా విభాగం), న్యూస్‌టుడే: కొవిడ్‌ నేపథ్యంలో చదువులకు ఆటంకం కలిగి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిపారు. ఉమ్మడి జిల్లాలో ఈనెల 6వ తేదీన ఇంటర్‌ మొదటి ఏడాది, 7వ తేదీన ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలు ప్రారంభమయ్యాయి. 268 కళాశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 119 కేంద్రాలు ఏర్పాటు చేశామని, గురువారంతో ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలు ముగిశాయని ఆర్‌ఐవో శంకర్‌ నాయక్‌ పేర్కొన్నారు. గురువారం జరిగిన పరీక్షకు 32,625 మందికిగాను 31,301 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. 1,325 మంది గైర్హాజరయ్యారన్నారు. మొదటి ఏడాది ఇంటర్‌లో గణితం, బోటనీ, సివిక్స్‌ పరీక్షలు 11వ తేదీ జరగాల్సి ఉంది. తుపాను నేపథ్యంలో 25వ తేదీ నిర్వహించాలంటూ ఇంటర్‌ బోర్డు నుంచి జిల్లా కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయని ఆర్‌ఐవో తెలిపారు.

నేటి నుంచి మూల్యాంకనం

నగరంలోని ప్రభుత్వ (టౌన్‌) జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని 20వ తేదీ నుంచి ప్రారంభించాలని ఇంటర్మీడియట్‌ విద్యా మండలి నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆర్‌ఐవో శంకర్‌ నాయక్‌ గురువారం తెలిపారు. ఇంగ్లిషు, తెలుగు, హిందీ, గణిత సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు చెప్పారు. కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మూల్యాంకనానికి హాజరు కావాల్సిన అధ్యాపకులకు ఇప్పటికే లేఖలు అందించినట్లు పేర్కొన్నారు. స్పాట్‌ వాల్యుయేషన్‌కు హాజరుకాని వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని