logo

ఆలంకొండలో విషాదం

 కృష్ణగిరి మండలంలోని ఆలంకొండలో ఈతకు వెళ్లి, బావిలో విద్యుదాఘాతం జరిగి నలుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన గురువారం జిల్లాలో  తీవ్ర విషాదాన్ని నింపింది. బావిలో ఈతకు దిగి విద్యుదాఘాతంతో నలుగురు చిన్నారులు మరణించారు. గ్రామస్థులు

Published : 20 May 2022 06:32 IST

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి 

కార్తిక్ , సాయి (పాతచిత్రాలు)

కృష్ణ్ణగిరి, న్యూస్‌టుడే:  కృష్ణగిరి మండలంలోని ఆలంకొండలో ఈతకు వెళ్లి, బావిలో విద్యుదాఘాతం జరిగి నలుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన గురువారం జిల్లాలో  తీవ్ర విషాదాన్ని నింపింది. బావిలో ఈతకు దిగి విద్యుదాఘాతంతో నలుగురు చిన్నారులు మరణించారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. ఎన్‌.కార్తిక్(13), సాయి(12), రాకేష్‌(12), షేక్‌ కమాల్‌బాషా(12) గురువారం మధ్యాహ్నం గ్రామ శివారు పొలాల్లో ఉన్న బావికి ఈతకు వెళ్లారు. అందులో విద్యుత్తు మోటారు ఉంది. నీటిలో వారు ఈత కొడుతుండగా నీటిలో విద్యుదాఘాతం సంభవించి నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం కంటి ముందు తిరిగిన పిల్లలు సాయంత్రానికి విగతజీవులై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

వీరాంజనేయులుకు ఒక కుమారుడు కార్తిక్, కుమార్తె ఉన్నారు.. కార్తిక్‌ డోన్‌ శ్రీసుధ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రమైంది. 

ఈశ్వరయ్యకు కుమారుడు సాయి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతనూ శ్రీసుధ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. కుమారుడు ఈతకు వెళ్లి చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.

రామానాయుడుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దవాడు రాకేష్‌ కటారుకొండ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. పెద్ద కుమారుడు మరణించడంతో తీవ్ర మనోవేదనతో విలపిస్తున్నారు.

షేక్‌ అమీన్‌ సాహెబ్‌కు ఇద్దరు కుమారులు. వారిది దేవనకొండ మండలం గుడిసెల గ్రామం. పెద్దకుమారుడు కమాల్‌బాషా పాఠశాలకు సెలవులు ఉండడంతో ఆలంకొండలో అవ్వతాతల వద్దకు వచ్చి ఈతకు వెళ్లి మృతి చెందాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని