logo

అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యల పరిష్కారం

అర్జీదారుడు సంతృప్తి చెందేలా స్పందన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఆయనతోపాటు జేసీ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు తదితరులు ప్రజల నుంచి అ

Published : 24 May 2022 04:15 IST


అర్జీదారుల సమస్యలు వింటున్న కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : అర్జీదారుడు సంతృప్తి చెందేలా స్పందన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఆయనతోపాటు జేసీ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం స్పందన అర్జీల పరిష్కారం తదితర అంశాలపై జిల్లా అధికారులతో, వీడియో కాన్ఫరెన్సు ద్వారా మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్‌ సమీక్షించారు. రెవెన్యూ శాఖలో వీఆర్వోలు సరిగా స్పందించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై ఇలాంటి ఆరోపణలు రాకుండా తహసీల్దార్లు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల బయోమెట్రిక్‌ నమోదు అంశంపై ప్రత్యేక దృష్టి సారించి హాజరు శాతం పెరిగేలా చూడాలని జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్యకు సూచించారు. జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో మంజూరైన ఇళ్ల పనులన్నీ మే నెలాఖరులోపు మొదలు కావాలన్నారు. జేసీ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని తహసీల్దార్లు, ఎంపీడీవోలకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని