విత్తన కాయలు అందక కన్నీళ్లు
రాయితీ వేరుసెనగలో భారీగా కోత
ఉమ్మడి జిల్లాకు 21,000 క్వింటాళ్లు
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: వర్షాలు ముందస్తుగా కురియడంతో అన్నదాతలు పొలంబాట పట్టారు. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. వర్షాధార పంటగా ఉమ్మడి జిల్లాలో రైతులు మెట్ట భూముల్లో వేరుసెనగ సాగు చేస్తుంటారు. జూన్ నుంచి జులై 15 వరకు విత్తనాలు విత్తుకోవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జూన్ 25వ తేదీ దాటితే రైతులు వేరుసెనగ సాగుకు ఆసక్తి చూపరు. ప్రభుత్వం రాయితీపై అందించే విత్తనాలు ఇప్పటి వరకు మండల కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలకు చేరలేదు. విత్తనాల కోసం కర్షకులు పడరాని పాట్లు పడుతున్నారు.
40 శాతం రాయితీ
కె-6 రకం వేరుసెనగ విత్తన ధర పూర్తి ఖరీదు క్వింటా రూ.8,580. ఇందులో 40 శాతం రాయితీ రూ.3,432 పోనూ రైతు రూ.5,148 చెల్లించాల్సి ఉంది. ఒక రైతుకు గరిష్ఠంగా 3 ప్యాకెట్లు (ఒక ప్యాకెట్ 30 కిలోలు) ఇవ్వనున్నారు.
ఖరారు కాని పంపిణీ తేదీలు
వేరుసెనగ విత్తన కాయల ధర, రాయితీ ఖరారైంది. గతేడాది మే 17 నుంచి విత్తన పంపిణీ ప్రారంభంకాగా.. ఈ యేడు విత్తన పంపిణీ తేదీలు ఇప్పటికీ ఖరారు చేయలేదు. రాయితీ వేరుసెగన కోసం రైతు భరోసా కేంద్రాల్లో డి.క్రిషి యాప్‌లో సోమవారం నుంచి పేర్లు నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. ఈ ప్రక్రియ వారం, పది రోజులపాటు ఉంటుందని పేర్కొంటున్నారు.
సేకరణ తగ్గించారు
గతేడాది ఏపీ సీడ్స్ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల పరిధిలోనే సేకరించి పంపిణీ చేశారు. ప్రస్తుతం ఏపీ సీడ్స్ ద్వారా రబీలో 1,300 క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాన్ని కొనుగోలు చేశారు. గతంలో ఏపీ సీడ్స్ సేకరించిన వేరుసెనగకు సంబంధించి రైతులకు రూ.కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో రైతుల నుంచి ఈ ఏడాది తక్కువగా కొనుగోలు చేశారు. ఏపీ సీడ్స్ వేరుసెనగ సేకరణ చేయకపోవడంతో రైతులు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు.
దుక్కులు దున్నేస్తున్నారు
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు కాస్త ముందే రావడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో మేలో సాధారణ వర్షపాతం 38.7 మిల్లీ మీటర్లు కాగా 20 రోజులకే 78.7 మి.మీ.లు నమోదైంది. సాధారణం కంటే 105 శాతం అధికంగా వర్షం కురిసింది.
మహానంది, గోనెగండ్ల, చాగలమర్రి, హాలహర్వి, హొళగుంద, కృష్ణగిరి, డోన్, రుద్రవరం, శిరివెళ్ల, ఆలూరు, చిప్పగిరి, ఆళ్లగడ్డ, గడివేముల, ప్యాపిలి, కొలిమిగుండ్ల మండలాల్లో సాధారణ కంటే రెండు, మూడు రెట్లు అధికంగా వర్షపాతం పడింది. దుక్కులు దున్నేందుకు అవసరమైన వర్షం పడటంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు.
భారీగా కోత విధించారు
తాజాగా రాయితీ విత్తనంలో మరోసారి కోత పెట్టారు. ఉమ్మడి జిల్లాకు కలిపి 21,000 క్వింటాళ్లు (కర్నూలు 16,300 క్వి, నంద్యాల 4,700 క్వి) కేటాయించడం గమనార్హం
ఉమ్మడి జిల్లాకు 1,07,142.6 క్వింటాళ్ల వేరుసెనగ విత్తనం అవసరం. 62,786 క్వింటాళ్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కేటాయించింది కేవలం 26,100 క్వింటాళ్లు (కర్నూలు 20,380 క్వి, నంద్యాలకు 5,720 క్వి).
మార్కెట్లో విక్రయించా - మాబు, ఎల్బండ, వెల్దుర్తి
మాది వెల్దుర్తి మండలం ఎల్.బండ. మూడెకరాల్లో కె-6 రకం వేరుసెనగ విత్తనం పండించా. ఏపీ సీడ్స్ ద్వారా కొనుగోలు చేస్తారేమోనని ఎదురుచూశాం. వారు కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్లో విక్రయిస్తున్నాం. బయట అమ్మడంతో క్వింటాపై రూ.1,600 మేర నష్టం వచ్చింది.
నాణ్యమైనవి అందిస్తాం - శ్రీనివాసరావు, ఏపీ సీడ్స్ డీఎం
రైతుల వద్ద నాణ్యమైన కె-6 వేరుసెనగ కాయలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు చేస్తాం. ప్రస్తుతం దేవనకొండ, తుగ్గలి, ఆస్పరి, పత్తికొండ ప్రాంతాల్లోని 11 ఆర్బీకేల వద్ద 1,300 క్వింటాళ్ల విత్తన కాయలు అందుబాటులో ఉంచాం. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇతర జిల్లాల నుంచి సర్టిఫైడ్ సీడ్ తెప్పించి ఉమ్మడి జిల్లాలకు సరఫరా చేసేందుకు చర్యలు ముమ్మరం చేశాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
NATO: మాడ్రిడ్‌కు బయల్దేరిన నాటో దేశాధినేతలు..!
-
General News
Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800కోట్లు మాయం..
-
India News
Mamata: జుబైర్, తీస్తా సీతల్వాడ్ చేసిన నేరమేంటి?: కేంద్రాకి దీదీ సూటిప్రశ్న
-
Movies News
Social Look: రామ్‌చరణ్ ఇంట బాలీవుడ్ స్టార్ల సందడి.. పూజాహెగ్డే ‘వాటర్ బ్రేక్’!
-
Sports News
Eoin Morgan: ఆ ‘గన్’ ఇక పేలదు.. రిటైర్మెంట్ ప్రకటించిన మోర్గాన్
-
General News
GHMC: భారీ వర్షం కురిసే అవకాశం... అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: జీహెచ్ఎంసీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- Madhavan: ఇది కలా.. నిజమా! మాధవన్‌ను చూసి ఆశ్చర్యపోయిన సూర్య..!
- Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత