logo

సీపీఎస్‌ రద్దు చేసి.. గడప తొక్కండి

ఎన్నికల్లో హామీ ఇచ్చారు.. సీపీఎస్‌ను రద్దు చేసి గడప తొక్కాలని ఉపాధ్యాయుడు పవన్‌ కుమార్‌ తన ఇంటి ఎదుట పోస్టర్‌ అంటించారు. అధికారులు, వైకాపా నాయకులు గమనించి ఆ ఇంటిని వదిలేసి మరో ఇంటికి వెళ్లారు. గడప... గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా

Published : 24 May 2022 04:15 IST

 

ఎన్నికల్లో హామీ ఇచ్చారు.. సీపీఎస్‌ను రద్దు చేసి గడప తొక్కాలని ఉపాధ్యాయుడు పవన్‌ కుమార్‌ తన ఇంటి ఎదుట పోస్టర్‌ అంటించారు. అధికారులు, వైకాపా నాయకులు గమనించి ఆ ఇంటిని వదిలేసి మరో ఇంటికి వెళ్లారు. గడప... గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలో ముగతిపేట కాలనీకి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి వచ్చారు. విద్యా దీవెన అందలేదని నాగరాజు, ఇల్లు నిర్మించుకొన్నా బిల్లు రాలేదని శ్రీనివాసులు, విద్యుత్తు బిల్లు ఎక్కువగా వచ్చిందని పింఛన్‌ తొలగించడం ఎక్కడి న్యాయం అంటూ గోవిందు ప్రశ్నించారు. విద్యుత్తు స్తంభాలను మార్చాలని కాలనీ వాసులు కోరగా వీధిలో మంచినీరు రావడం లేదని సావిత్రమ్మ వాపోయారు.- న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని