logo

ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయొద్దు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే దిశగా చర్యలు తీసుకుందని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ ఆరోపించారు. ఎమ్మిగనూరులో జరిగిన ఎస్టీయూ సర్వసభ్య సమావేశంలో జనార్దన్‌ మాట్లాడుతూ పాదయా

Published : 24 May 2022 04:15 IST

ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌


సమావేశంలో మాట్లాడుతున్న ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే దిశగా చర్యలు తీసుకుందని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ ఆరోపించారు. ఎమ్మిగనూరులో జరిగిన ఎస్టీయూ సర్వసభ్య సమావేశంలో జనార్దన్‌ మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శ ప్రాథమిక పాఠశాల వ్యవస్థను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలకు రెండు పోస్టులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మూడేళ్లగా డీఎస్సీ నిర్వహించలేదని ఆరోపించారు. నాడు నేడు కింద పాఠశాలకు నిధులిస్తే సరిపోదని, వాటికి సంబంధించిన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌ బసవరాజు, ప్రసన్నరాజు, యల్లప్ప, బాబయ్య, సురేష్‌, రామచంద్ర, మల్లప్ప, చంద్రశేఖర్‌, రంగనాథ్‌, నాగరాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని