logo

ప్రభుత్వాల అసమర్థ విధానాలతో సాగులో సంక్షోభం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ విధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. సోమవారం రైతు సంఘం నంద్యాల జిల్లా ప్రథమ మహాసభలు పట్టణంలోని ఎన్జీవో కాలనీలోని నేషనల్‌ పీజీ కళాశాలలో నిర్వహిం

Published : 24 May 2022 04:15 IST


మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య

నంద్యాల గ్రామీణం,న్యూస్టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ విధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. సోమవారం రైతు సంఘం నంద్యాల జిల్లా ప్రథమ మహాసభలు పట్టణంలోని ఎన్జీవో కాలనీలోని నేషనల్‌ పీజీ కళాశాలలో నిర్వహించారు. ముందుగా రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర జెండా ఎగురవేశారు. సభకు హాజరైన ప్రతినిధులు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ అన్నదాతల సమస్యలపై పోరాటాలు ఉద్ధృతం చేయాలన్నారు. కేంద్రం రైతులకు గిట్టుబాటు ధర కల్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదన్నారు. 75 కిలోల బస్తాకు రూ.1,490 మద్దతు ధర కేంద్రం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.900 నుంచి రూ.1,100 వరకే ఇస్తోందన్నారు. దిల్లీ తరహాలో రైతులంతా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో రమేశ్‌కుమార్‌, రాజశేఖర్‌, నాగరాజు, నాగేశ్వరరావు, నాగేంద్ర, రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని