logo

నాన్న..నిదురలే

‘నాన్న.. నిదుర లేనాన్న’ అంటూ తండ్రి మృతదేహంపై పడి కుమార్తెలు, కుమారుడి రోదిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. ఆదోని మండలం దిబ్బనకల్లు క్రాస్‌ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసులు(50)

Updated : 28 May 2022 05:54 IST

రోదిస్తున్న పిల్లలు, భార్య, కుటుంబ సభ్యులు

‘నాన్న.. నిదుర లేనాన్న’ అంటూ తండ్రి మృతదేహంపై పడి కుమార్తెలు, కుమారుడి రోదిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. ఆదోని మండలం దిబ్బనకల్లు క్రాస్‌ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసులు(50) అనే ఉపాధ్యాయుడు మృతి చెందగా.. అతని కుమార్తె తుషారా గాయపడ్డారు. లారీ డ్రైవర్‌ అతివేగం, అజాగ్రత్త ఓ కుంటుంబాన్ని వీధిన పడేసింది. కుటుంబ సభ్యులు, తాలుకా పోలీసుల కథనం ప్రకారం.. పత్తికొండ పట్టణం టీచర్స్‌ కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాసులు మద్దికెర మండలం పెరవలి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. భార్య నిర్మల, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆదోని పట్టణంలో బంధువుల పెళ్లికి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. మధ్యాహ్న సమయంలో భోజనం ముగించుకొని శ్రీనివాసులు, ఆయన కుమార్తె తుషారా ద్విచక్రవాహనంపై పత్తికొండకు బయల్దేరారు. దిబ్బనకల్లు క్రాస్‌ సమీపంలో డోన్‌ మండలానికి చెందిన లారీ ఢీకొనడంతో ఇద్దరూ గాయపడ్డారు. శ్రీనివాసులు తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు హుటాహుటిన ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు శ్రీనివాసులు మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. లారీ డ్రైవర్‌ హుసేన్‌వలి అతివేగం, అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై మోహన్‌కృష్ణ తెలిపారు. - న్యూస్‌టుడే, ఆదోని నేరవార్తలు

శ్రీనివాసులు (పాత చిత్రం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని