డిజిటల్‌ ఐడీతో మెరుగైన వైద్యం

రోగులు ఆరోగ్య సేవల కోసం ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వారి ఆరోగ్య, చికిత్స తదితర వివరాలను వారి వ్యక్తిగత ఐడీ నంబరు ద్వారా నమోదు చేస్తారని, తదుపరి  సేవల కోసం దేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా మైరుగైన వైద్యం

Published : 04 Jun 2022 02:52 IST

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : రోగులు ఆరోగ్య సేవల కోసం ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వారి ఆరోగ్య, చికిత్స తదితర వివరాలను వారి వ్యక్తిగత ఐడీ నంబరు ద్వారా నమోదు చేస్తారని, తదుపరి  సేవల కోసం దేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా మైరుగైన వైద్యం అందుతుందని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సర్వజన వైద్యశాలలోని ధన్వంతరి సమావేశ సమావేశంలో ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ ఈ-ఆస్పత్రి సేవలపై వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందికి శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన రోగులకు ప్రత్యేక ఐడీ నంబరు ఇస్తారని, ఇందులో రోగులకు సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేస్తారన్నారు. దీనివల్ల రోగుల పూర్వపు వైద్యం వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎన్‌ఐసీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సయ్యద్‌ ఉస్మాన్‌ పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐసీ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంటు డా.ప్రభాకరరెడ్డి, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఏఆర్‌ఎంవో డాక్టర్‌ హేమనళిని తదితరులు పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని