logo

స్వచ్ఛబడులు

పరిశుభ్రత.. పారిశుద్ధ్య నిర్వహణలో ఉమ్మడి జిల్లాలో బాగున్న 38 పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. ఇందులో 8 అత్యుత్తమమైనవి , 30 సబ్‌ కేటగిరీ వారీగా ఉన్నాయి. రేటింగ్‌ ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసి జాతీయ స్థాయికి

Published : 26 Jun 2022 01:11 IST

ఏ విభాగంలో ఏ పాఠశాల

అత్యుత్తమ స్థాయిలో ఎంపికైన గణేకల్‌ పాఠశాల

కర్నూలు విద్యా విభాగం, న్యూస్‌టుడే: పరిశుభ్రత.. పారిశుద్ధ్య నిర్వహణలో ఉమ్మడి జిల్లాలో బాగున్న 38 పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. ఇందులో 8 అత్యుత్తమమైనవి , 30 సబ్‌ కేటగిరీ వారీగా ఉన్నాయి. రేటింగ్‌ ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసి జాతీయ స్థాయికి పంపిస్తారు. అక్కడ గుర్తింపు వస్తే స్వచ్ఛ విద్యాలయ అవార్డుతోపాటు రూ.50 వేలు, సమగ్ర శిక్ష పథకం కింద ఒక్కో పాఠశాలకు రూ.20 వేల నగదు బహుమతి దక్కుతుంది.

59 ప్రశ్నలకు సమాధానాలు

* పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమంగా రాణించిన పాఠశాలలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ పురస్కారాలు అందిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 4,511 విద్యాలయాలు ఉండగా వీటిలో 3,876 బడుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

* సర్కారు బడుల్లో మరుగుదొడ్ల నిర్వహణ, చేతుల శుభ్రత, పరిసరాల పచ్చదనం, తాగునీరు, కొవిడ్‌ మార్గదర్శకాలు వంటి అంశాలు సీఆర్‌పీలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల కమిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

* సుమారు 59 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ఆన్‌లైన్‌లో పొందుపరిచి వాటిని పూరించిన ఆధారంగా అంతర్జాలంలోనే స్టార్‌ల రూపంలో రేటింగ్‌ ఇచ్చారు. ఐదు నక్షత్రాలు రేటింగ్‌ వచ్చిన వాటి వివరాలను యాప్‌లో పొందుపరిచినట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్టు అదనపు సమన్వయకర్త డాక్టర్‌ వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

* నిబంధనల అమలు : కృష్ణగిరి మండలంలోని కటారుకొండ ఎంపీపీ, వెలుగోడు మండలంలోని రేగడిగూడూరు ఎంపీపీ, ఎమ్మిగనూరులోని బనవాసి నవోదయ, నంద్యాల సాయిబాబాపేటలో ఉన్న ఎంపీఎల్‌పీ, ఎమ్మిగనూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలకు ఐదు స్టార్ల రేటింగ్‌ ఇచ్చారు.

* విద్యార్థుల ప్రవర్తన : నంద్యాల మండలం కోనాపురం ఎంపీయూపీ, బేతంచెర్ల మండలంలోని రహిమాన్‌పురం ఎంపీయూపీ, ఎమ్మిగనూరు మండలంలోని కడివెళ్ల జడ్పీ ఉన్నత విద్యాలయం, నంద్యాలలోని ఎంఎస్‌ నగర్‌లో ఉన్న ఎంపీఎల్‌యూపీ, కల్లూరు శరీన్‌ నగర్‌లో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలు సబ్‌ కేటగిరీ కింద ఎంపికయ్యాయి.

* బడి బాగు: ఆస్పరి మండలంలోని హలిగేరి ఎంపీయూపీ, కల్లూరు పందిపాడులోని మౌంట్‌ పాఠశాల, లక్ష్మీపురం కేజీబీవీ, కర్నూలు నరసింహారెడ్డి నగర్‌లో ఉన్న ఎంసీపీ, కల్లూరు బి.క్యాంపులో ఉన్న ఏపీటీడబ్ల్యూ రెసిడెన్షియల్‌ (బాలికల) పాఠశాలలు సబ్‌ కేటగిరీ కింద ఎంపిక చేశారు.

* చేతుల శుభ్రత: పత్తికొండ ఎం.పేటలో ఉన్న ఎంపీపీ పాఠశాల, కర్నూలు మండలంలోని పసుపల ఎంపీపీ, జూపాడుబంగ్లాలోని ఏపీ మోడల్‌ స్కూల్‌, ఉయ్యాలవాడ మండలంలోని కాకరవాడ ఎంపీపీ, కల్లూరులోని పెద్దపాడు ఏపీ మోడల్‌ పాఠశాలలు సబ్‌ కేటగిరీ కింద ఎంపికయ్యాయి.

* మరుగుదొడ్ల నిర్వహణ: ఆదోని మండలం కుప్పగల్‌ ఎంపీయూపీ, ఇస్వీ ఎంపీయూపీ, కల్లూరు చిన్నటేకూరులోని ఎస్‌వీహెచ్‌ఎస్‌, గూడూరులోని ఎంపీపీ,  ఎమ్మిగనూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలు సబ్‌ కేటగిరీ కింద ఎంపికయ్యాయి.

* తాగునీటి వసతి : కల్లూరులోని లక్ష్మీపురం ఎంపీపీ, చాగలమర్రి మండలంలోని శెట్టివీడు ఎంపీపీ, కోడుమూరులోని జీవీఆర్‌ ఉన్నత విద్యాలయం, మునగాలపాడులోని ప్రజ్ఞ భారతి, కర్నూలు నగరంలోని ప్రభుత్వ టౌన్‌ మోడల్‌ పాఠశాలలకు స్థానం లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని