logo

జనంపై మోయలేని భారం మోపారు

ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి జనంపై మోయలేని భారం మోపిందని తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాలకుర్తి గ్రామంలో శనివారం తెదేపా నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ

Published : 26 Jun 2022 01:11 IST

గ్రామస్థుల సమస్యలువింటున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి జనంపై మోయలేని భారం మోపిందని తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాలకుర్తి గ్రామంలో శనివారం తెదేపా నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీగా వెళ్తూ గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ వస్తువు తీసుకోవాలన్నా భయమేస్తోందని, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని గ్రామస్థులు వివరించారు.  కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్‌, నాయకులు హనుమంతరావు చౌదరి, మండల కన్వీనర్‌ కోట్ల కవిత, నాయకులు వెంకటేశ్‌ నాయక్‌, రాఘవేంద్ర, మధు, పాపారాయుడు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని