logo

దుల్హన్‌ సాయం ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం

:ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించలేని దుస్థితికి జగన్‌ ప్రభుత్వం చేరుకుందని తెదేపా మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా

Updated : 26 Jun 2022 03:37 IST

నంద్యాల పట్టణంలో నిరసన తెలుపుతున్న తెదేపా నాయకులు

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే :ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించలేని దుస్థితికి జగన్‌ ప్రభుత్వం చేరుకుందని తెదేపా మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహమ్మద్‌ పేర్కొన్నారు. దుల్హన్‌ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో శనివారం ముస్తాక్‌ అహమ్మద్‌ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ  అమలు చేయలేదని విమర్శించారు. మోసం చేసిన జగన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ముస్లింలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.  తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ మాబూవలి, కౌన్సిలర్‌ నాగార్జున, నాయకులు జియా, గౌస్‌, వారిస్‌, హమీద్‌, ఆయూబ్‌ పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని