logo

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

సమాజాన్ని సంస్కరించడం కేవలం విద్యతోనే సాధ్యమని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. ఏపీ సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ 2021-22కు ఎంపికైన పాఠశాలలకు సంబంధించిన హెచ్‌ఎంలకు జిల్లా

Published : 26 Jun 2022 01:11 IST

హెచ్‌ఎంలకు పురస్కారాలు అందిస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు, జడ్పీ ఛైర్మన్‌ పాపిరెడ్డి, మేయర్‌ రామయ్య,

డిప్యూటీ మేయర్‌ రేణుక తదితరులు

కర్నూలు సచివాలయం, కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: సమాజాన్ని సంస్కరించడం కేవలం విద్యతోనే సాధ్యమని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. ఏపీ సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ 2021-22కు ఎంపికైన పాఠశాలలకు సంబంధించిన హెచ్‌ఎంలకు జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కర్నూలు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 4,511 పాఠశాలలు ఉన్నాయని, వీటిలో నాడు-నేడు మొదటి దశలో 1,080 బడులను ఎంపిక చేసి రూ.336 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఈ దేశాన్ని.. రాష్ట్రాన్ని ముందుకు నడిపించేది విద్యే అని చెప్పారు. ఎవరికైనా ఇవ్వగలిగిన ఖరీదైన బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే అని పేర్కొన్నారు. రెండో విడతలో 1,185 పాఠశాలలకు రూ.454 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పాఠశాలలను తీర్చిదిద్దేందుకు సీఎం చేస్తున్న కృషి ఆదర్శనీయమని చెప్పారు. విద్యాలయాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన హెచ్‌ఎంలు, పేరెంట్స్‌ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీ ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులను సీఎం తీసుకొచ్చారని కొనియాడారు. కోడుమూరు ఎమ్మెల్యే డా.జె సుధాకర్‌, మేయర్‌ బీవై రామయ్య, డిప్యూటీ మేయర్‌ రేణుక మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులు రాణించేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. అన్నారు. సాధారణ  ఉద్యోగి సైతం తమ పిల్లలను కార్పొరేట్‌ స్థాయి పాఠశాలల్లో చేర్పిస్తున్నారని.. మన కలెక్టర్‌ తన కుమారుడిని అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి స్ఫూర్తిదాయకంగా నిలిచారని చెప్పారు. ఇన్‌ఛార్జి డీఈవో శివప్రకాష్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీవో వేణుగోపాల్‌ మాట్లాడుతూ స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు 38 పాఠశాలలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం హెచ్‌ఎంలకు పురస్కారాలు అందజేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని