logo

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం

జిల్లాలో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారాలు అందిస్తామని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో సోమవారం ప్రత్యేక

Published : 28 Jun 2022 02:24 IST

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు తదితరులు

కర్నూలు బి.క్యాంపు, కర్నూలు నగరం, న్యూస్‌టుడే: జిల్లాలో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారాలు అందిస్తామని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ పాల్గొని జ్యోతి వెలిగించి మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన చర్యలతోపాటు ఎంఎస్‌ఎంఈలను ప్రమోట్‌ చేయడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేశామన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల కేటాయింపునకు తరచూ సమావేశం నిర్వహిస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పారిశ్రామికవాడలు ఏర్పాటుచేసి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో లక్ష్యాలు అధిగమించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. కొవిడ్‌ సమయంలో నిరంతరం ఆక్సిజన్‌ను సరఫరా చేసిన ఆర్‌ఎస్‌ గ్యాస్‌ అధినేత విజయ్‌కుమార్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, ఐలా ఛైర్మన్‌ రామకృష్ణారెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖర్‌రెడ్డి, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఉమాదేవి, ఎల్‌డీఎం వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని