logo
Published : 28 Jun 2022 02:24 IST

అమ్మఒడికి రూ.258.16 కోట్లు

జ్యోతి వెలిగిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ చిత్రంలో ఎమ్మెల్యేలు శిల్పా

రవిచంద్రకిశోర్‌, ఆర్థర్‌ తదితరులు

నంద్యాల పట్టణం : పేద కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు.. ఈ పథకం కింద జిల్లాలోని 1,72,112 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.258.16 కోట్లు జమ చేశామని కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలానీ సామూన్‌ తెలిపారు. స్థానిక మున్సిపల్‌ టౌన్‌హాల్‌లో సోమవారం జగనన్న అమ్మఒడి పథకం కింద ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఆర్థర్‌, డీఈవో సత్యనారాయణ మూర్తి, ఐసీడీఎస్‌ సీడీపీవో లలితాకుమారి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ గంగిశెట్టి శ్రీధర్‌, హస్తకళల కార్పొరేషన్‌ రాష్ట్ర సంచాలకులు సునీత, ఉర్దూ అకాడమీ రాష్ట్ర సంచాలకులు అబ్దుల్‌ షుకూర్‌, ఉప విద్యాశాఖాధికారిణి అనురాధ, ఎంఈవో బ్రహ్మం, కౌన్సిలర్‌ తమీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts