logo

ముద్రణాలయాన్ని అభివృద్ధి చేయండి

ప్రభుత్వ ముద్రాణాలయాన్ని అభివృద్ధి చేసేలా అన్నివిధాలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ముద్రణాలయ ఉద్యోగుల సంఘం ఐఎన్‌టీయూసీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు కోరారు. రాష్ట్ర ప్రింటింగ్‌ స్టేషనరీ కమిషనర్‌ ఏబీ వెంకటేశ్వరరావు సోమవారం

Published : 28 Jun 2022 02:24 IST

సిబ్బంది పనితీరును పరిశీలిస్తున్న కమిషనర్‌ ఏబీ వెంకటేశ్వరరావు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ప్రభుత్వ ముద్రాణాలయాన్ని అభివృద్ధి చేసేలా అన్నివిధాలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ముద్రణాలయ ఉద్యోగుల సంఘం ఐఎన్‌టీయూసీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు కోరారు. రాష్ట్ర ప్రింటింగ్‌ స్టేషనరీ కమిషనర్‌ ఏబీ వెంకటేశ్వరరావు సోమవారం కర్నూలు కొత్తపేటలోని ప్రభుత్వ ముద్రణాలయం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు విన్నవించారు. 1954లో రేకుల షెడ్డులో ఏర్పాటైన ముద్రణాలయం కనీస అభివృద్ధికి నోచుకోలేదన్నారు.  రాష్ట్ర విభజన తర్వాత తమ ముద్రణాలయానికి రూ.9 కోట్లు మంజూరయ్యాయని, నిధులు విడుదలకాక భవనం కేవలం పునాదులకే పరిమితమైందని చెప్పారు. ప్రభుత్వ ముద్రణాలయాన్ని అభివృద్ధి చేయకపోవడంతో ప్రభుత్వం 45 శాఖల పనులను ప్రైవేటుకు అప్పగించి రూ.300 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. కర్నూలు శాఖకు రూ.30 కోట్లు కేటాయించి భవన నిర్మాణం చేయించాలని, ఆధునిక యంత్రాలు తెప్పిస్తే ప్రభుత్వానికి రూ.300 కోట్లు ఆదా అవుతుందని చెప్పారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని