logo
Published : 28 Jun 2022 02:24 IST

అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలి

నిరసనలో కూర్చున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

కర్నూలు (నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షుడు సుధాకర్‌ బాబు డిమాండ్‌ చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయం వద్ద సోమవారం సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యువత భవిష్యత్తును నాశనం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలబడి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు జాన్‌ విల్సన్‌, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బతుకన్న, మహిళా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పాలెం సుజాత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts