త్వరితగతిన పెండింగ్‌ కేసుల దర్యాప్తు

జిల్లా పరిధిలోని ఆయా పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌ కేసుల దర్యాప్తు ముగించి ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని  ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని బొమ్మలసత్రంలో ఉన్న జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన జిల్లాలోని అన్నీ సబ్‌ డివిజన్లకు

Published : 29 Jun 2022 02:15 IST

మాట్లాడుతున్న ఎస్పీ రఘువీర్‌రెడ్డి

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా పరిధిలోని ఆయా పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌ కేసుల దర్యాప్తు ముగించి ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని  ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని బొమ్మలసత్రంలో ఉన్న జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన జిల్లాలోని అన్నీ సబ్‌ డివిజన్లకు సంబంధించి దశలవారీగా నేర సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సాధించి.. రక్షణకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు. నాటుసారా, జూదం, క్రికెట్‌ బెట్టింగ్‌ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి వాటిని అరికట్టాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు, సిగ్నల్స్‌ ఏర్పాటు చేసి నివారించాలన్నారు. మహిళలు, బాలికల అదృశ్యం కేసుల్లో సమగ్ర విచారణ జరిపి వారి ఆచూకీ త్వరగా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హత్య, పోక్సో కేసు దర్యాప్తు తర్వితగతిన పూర్తి చేయాలన్నారు. ఎస్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్‌ ఆర్‌.రమణ, డీఎస్పీలు మహేశ్వరరెడ్డి, రామాంజీనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని