logo
Published : 29 Jun 2022 02:15 IST

టిడ్కో నివాసం.. గొర్రెలకు ఆవాసం..

ముళ్లపొదలు.. గడ్డి పెరిగిపోవడంతో టిడ్కో గృహాల వద్ద మూగజీవాలు

మనుషులు ఉండాల్సిన ఇళ్ల వద్ద మూగజీవాలు తిష్టేశాయి. ముళ్లపొదలు, గడ్డి పెరిగిపోవడంతో అక్కడికి చేరుకుంటున్నాయి. టిడ్కో గృహాలు నిర్మించి సిద్ధం చేసినా లబ్ధిదారులకు అందించడంలో నిర్లక్ష్యం కారణంగా గృహాల చుట్టూ ముళ్లపొదలు పెరిగి అధ్వానంగా మారింది. నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలో 288 టిడ్కో గృహాలు నిర్మించాల్సి ఉండగా రూ.10 కోట్లతో 240 ఇళ్లను నిర్మించి వాటికి రంగులు వేశారు. మిగిలిన 48 గృహాలు పూర్తి చేయాల్సి ఉండగా మధ్యలోనే ఆగిపోయాయి. మంత్రి బుగ్గన ఇలాఖాలోనే ఈ పరిస్థితి ఏర్పడింది. అనర్హులకు కేటాయించారంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2020 ఏప్రిల్‌లో టిడ్కో గృహ నిర్మాణాలకు వైకాపా ప్రభుత్వం రివర్స్‌ టెండర్లు పిలిచింది. హైదరాబాద్‌కు చెందిన దాస్‌ ఇంజినీరింగ్‌ సంస్థ టెండరు పనులను దక్కించుకుంది.
- ఈనాడు, కర్నూలు

 

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts