logo

ఇళ్లు నిర్మిస్తానని డబ్బుల వసూలు

గనన్న కాలనీలో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని.. ఇప్పుడు మాకేమీ సంబంధం లేదంటూ చేతులెత్తేశారని నందికొట్కూరు మండలం దామగట్లకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నందికొట్కూరు గృహ నిర్మాణశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

Published : 29 Jun 2022 02:15 IST

 ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.1.50 లక్షలు
 జగనన్న కాలనీలో అక్రమాలపై మహిళల ఆవేదన

కార్యాలయం వద్ద బాధిత మహిళలు

నందికొట్కూరు, న్యూస్‌టుడే: జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని.. ఇప్పుడు మాకేమీ సంబంధం లేదంటూ చేతులెత్తేశారని నందికొట్కూరు మండలం దామగట్లకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నందికొట్కూరు గృహ నిర్మాణశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గ్రామంలోని జగనన్న కాలనీలో 20 మందికి పట్టాలు మంజూరయ్యాయి. గతేడాది గృహ నిర్మాణశాఖ ఏఈ శేఖర్‌, పనుల పర్యవేక్షకుడు విజయభాస్కర్‌ కలిసి గుత్తేదారు సింహాచలాన్ని తీసుకొచ్చారు. రూ.3.80 లక్షలకు ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు.. ముందుగా ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షలు తీసుకొన్నారు. కొన్నాళ్లు పనులు చేశాక గుత్తేదారుడు కనిపించడం లేదని బాధితులు వాపోయారు.  అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయమై ఏఈ శేఖర్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లతో మాట్లాడగా తమకు సంబంధం లేదంటూ తప్పించుకొనే ప్రయత్నం చేశారు.  ప్రజా సంఘాల నాయకులు కార్యాలయానికి వచ్చి ఏఈ శేఖర్‌ను నిలదీయడంతో తానే తీసుకొచ్చినట్లు ఒప్పుకొని.. నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని