logo

రాజధాని భూములు అమ్మాలనుకోవడం దుర్మార్గం

అమరావతిలో రాజధాని నిర్మాణానికి రైతులిచ్చిన భూములు అమ్మే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 29 Jun 2022 02:15 IST

సమావేశంలో మాట్లాడుతున్న సోమిశెట్టి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: అమరావతిలో రాజధాని నిర్మాణానికి రైతులిచ్చిన భూములు అమ్మే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన మంగళవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూములను విక్రయించడం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఈ భూముల్లో రోడ్ల నిర్మాణం, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. రాజధానిలో పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మాటే మరిచిపోయారని ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా చేశారని దుయ్యబట్టారు. ఇలాంటి వారు ప్రస్తుతం ఎకరాను రూ.10 కోట్లకు విక్రయించే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్‌తో జగన్‌ కుమ్మక్కై అమరావతిని అభివృద్ధి చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు పెరిగేందుకు దోహదపడుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వ ఆస్తులను విక్రయించే విషయాన్ని పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ఆయన హితవు పలికారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని