logo

పది గంటల వ్యవధిలో మేనమామ, మేనల్లుడి మృతి

అనారోగ్యంతో మేనమామ మృతిచెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన అల్లుడు గుండెపోటుతో మరణించారు. గడివేముల మండలం బిలకలగూడూరులో ఈ ఘటన జరిగింది. పది గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు

Published : 29 Jun 2022 02:35 IST

గడివేముల, న్యూస్‌టుడే: అనారోగ్యంతో మేనమామ మృతిచెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన అల్లుడు గుండెపోటుతో మరణించారు. గడివేముల మండలం బిలకలగూడూరులో ఈ ఘటన జరిగింది. పది గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. బిలకలగూడూరు గ్రామానికి చెందిన శివయ్య(36) కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. శాంతిరాం వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చిన తర్వాత అతని మేనల్లుడు ఈశ్వర్‌(30) తీవ్రంగా దు:ఖించాడు. అర్ధరాత్రి వరకు మృతదేహం వద్దే ఉండి ఇంటికి వచ్చారు. తెల్లవారుజామున మరుగుదొడ్డికి వెళ్లారు. ఉదయం 8 గంటలైనా భర్త కనిపించకపోవడంతో అనుమానం వచ్చి భర్త కోసం వాకబు చేసింది. మరుగుదొడ్డి తలుపు తీసేందుకు యత్నించగా లోపల గడియపెట్టి ఉండడంతో వెంటనే గడియ ధ్వంసం చేసి తలుపు తీశారు. ఈశ్వర్‌ విగతజీవిగా పడి ఉండటంతో బయటకు తీసుకువచ్చి చూడగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మేనమామ మృతిని తట్టుకోలేక గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈశ్వర్‌కు కుమార్తె, కుమారుడు సంతానం. ఈశ్వర్‌ గ్రామ సర్పంచి నారాయణ కుమారుడు కాగా, శివయ్య మాజీ సర్పంచి చిన్నయంగన్న కుమారుడు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని