logo

గ్యాస్‌ కనెక్షన్లతో గృహిణులకు వంటింటి కష్టాలు దూరం

ఆదోని మండలం పెద్ద తుంబళం గ్రామంలోని  పేదలకు ఉజ్వల పథకం కింద మంజూరైన వంట గ్యాస్‌ కనెక్షన్లు భాజపా అన్య భాషా విభాగం రాష్ట్ర కన్వీనర్‌ ప్రకాశ్‌ జైన్‌

Updated : 29 Jun 2022 14:08 IST

ఆదోని మార్కెట్ : ఆదోని మండలం పెద్ద తుంబళం గ్రామంలోని  పేదలకు ఉజ్వల పథకం కింద మంజూరైన వంట గ్యాస్‌ కనెక్షన్లు భాజపా అన్య భాషా విభాగం రాష్ట్ర కన్వీనర్‌ ప్రకాశ్‌ జైన్‌ పంపిణీ చేశారు. మొత్తం 70 కుటుంబాలకు వీటిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలకు వంటింటి కష్టాలను దూరం చేయాలనే ఉద్దేశంతో ఉజ్వల పథకం తీసుకొచ్చిందన్నారు. తద్వారా గృహిణులకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ ఓబీసీ విభాగం రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్‌, నర్సిరెడ్డి, యువరాజ్‌, శ్రీనివాసులు, శంకరయ్య తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని