logo

ఆర్టీసీ బాదుడు

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మరింత భారం కానుంది. డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రభుత్వం ఛార్జీల మోత మోగించింది. రెండు నెలల కిందట ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే.

Published : 01 Jul 2022 00:52 IST

ఆదోని ఆర్టీసీ, డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మరింత భారం కానుంది. డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రభుత్వం ఛార్జీల మోత మోగించింది. రెండు నెలల కిందట ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. మళ్లీ పెంచడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. 30 కి.మీలు దాటి ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడిపై రూ.5 నుంచి రూ.80 వరకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో వివిధ డిపోల పరిధిలో ఛార్జీల వివరాలు స్థానిక అధికారులకు అందలేదు.
12 డిపోలు... 925 బస్సులు
ఉమ్మడి జిల్లాలో 12 ఆర్టీసీ డిపోల పరిధిలో 925 బస్సులు ఉన్నాయి. నిత్యం 3.20 లక్షల కి.మీ మేర తిరుగుతూ మూడు లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. నిత్యం 60 వేల లీటర్ల ఇంధనం వినియోగిస్తున్నారు. రూ.40 లక్షల మేర ఆదాయం సమకూరుతోంది.
30 కి.మీ దాటితే
* పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10 ఉంది. 30 కి.మీ వరకు ఎలాంటి పెంపు లేదు. 31-60 కి.మీ రూ.5, 61- 70 వరకు రూ.10, 100 కి.మీ దాటితే రూ.120 సెస్‌ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
* ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 30 కి.మీ వరకు సెస్‌ పెంపు లేదు. 31- 65 కి.మీ వరకు రూ.5, 66-80 కి.మీ వరకు రూ.10 పెంచారు.
* సూపర్‌ లగ్జరీ, ఏసీ బస్సుల్లో రూ.10 సెస్‌ వసూలు చేస్తున్నారు. వీటిలో 55 కి.మీ వరకు పెంపు లేదు. తర్వాత భారీగా పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు