logo

బుస్సుమంటున్న బస్సు

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం దూర‘భారం’కానుంది. డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రభుత్వం మరోసారి ఛార్జీలు పెంచింది. తక్కువ దూరం వెళ్లేవారిపై ప్రభావం తక్కువగా ఉన్నా దూర ప్రయాణాలు సాగించేవారిపై భారీగా భారం మోపింది. ఉమ్మడి జిల్లాలో నైట్‌ రైడర్‌ 2, ఇంద్ర 19, సూపర్‌లగ్జరీ 159

Published : 02 Jul 2022 01:56 IST

పెరిగిన ఛార్జీలతో హడలుతున్న జనం

కర్నూలు ఆర్టీసీ, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం దూర‘భారం’కానుంది. డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రభుత్వం మరోసారి ఛార్జీలు పెంచింది. తక్కువ దూరం వెళ్లేవారిపై ప్రభావం తక్కువగా ఉన్నా దూర ప్రయాణాలు సాగించేవారిపై భారీగా భారం మోపింది. ఉమ్మడి జిల్లాలో నైట్‌ రైడర్‌ 2, ఇంద్ర 19, సూపర్‌లగ్జరీ 159, అల్ట్రా 38, ఎక్స్‌ప్రెస్‌ 188, పల్లెవెలుగు 519 బస్సులు ఉన్నాయి. నిత్యం మూడు లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. వీటి కోసం నిత్యం 60 వేల లీటర్ల ఇంధనం వినియోగిస్తున్నారు. చమురు ధరలు తగ్గినా టికెట్‌ ధరలు పెంచడం గమనార్హం.

ప్రధాన నగరాలకు

* కర్నూలు నుంచి బెంగళూరుకు 12, చెన్నై 6, తిరుపతి 4, విజయవాడ 18, హైదరాబాద్‌ 8, నెల్లూరు 2, విశాఖ 1, వేలూరుకు 2 బస్సులు వెళ్తాయి. ఇందులో 80 శాతం వరకు ఓఆర్‌ ఉంది. ఇంద్ర బస్సుల్లో సెస్‌ భారం ఎక్కువగా ఉంది.. ఒక్కో టికెట్‌పై రూ.100పైగా పెరిగింది.

* కర్నూలు నుంచి విజయవాడకు నైట్‌ రైడర్‌ బస్సు నడుస్తోంది. 40 సీట్ల కెపాసిటీ ఉన్న ఈ బస్సులో ఛార్జీ రూ.750 నుంచి రూ.850కు పెరిగింది. నిత్యం 80 శాతం ఓఆర్‌తో నడుస్తోంది. టికెట్‌పై రూ.100 పెరగడంతో రూ.3 వేల నుంచి 4 వేల వరకు ఆదాయం వస్తుంది.

జిల్లాలో ప్రధాన పట్టణాలకు

కర్నూలు నుంచి ఆదోనికి 15, ఆళ్లగడ్డ 5, ఆత్మకూరు 20, బనగానపల్లి 5, డోన్‌ 2, కోవెలకుంట్ల 8, శ్రీశైలం 8, నంద్యాలకు 30 వరకు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు వెళ్తాయి. నిత్యం 75 నుంచి 80 శాతం మేర ఓఆర్‌ వస్తుంది. ప్రసుత్తం ఒక్కో టికెట్‌పై సగటున రూ.10 చొప్పున పెంచారు.

శ్రీశైలానికి వెళ్లాలంటే

కర్నూలు నుంచి శ్రీశైలానికి నిత్యం నాలుగు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు 8 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఒక్కో టికెట్‌పై రూ.40 పెరిగింది. సూపర్‌ లగ్జరీ బస్సులో రూ.100 పెరిగింది.

నంద్యాల జిల్లాకు అధిక లాభం

డీజిల్‌ సెస్‌ ఛార్జీలు పెరగడంతో నంద్యాల జిల్లాకు మరింత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ జిల్లా పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, కోవెలకుంట్ల, బనగానపలి, డోన్‌, నందికొట్కూరు డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల నుంచి అధిక భాగం బస్సులు నంద్యాల జిల్లాల నుంచి నడుస్తున్నాయి. పెరిగిన డీజిల్‌ సెస్‌ ప్రభావంతో రోజుకు రూ.లక్షకు పైగా ఆదాయం వస్తుందని ప్రజా రవాణాధికారులు అంచనా వేస్తున్నారు.

పాత కొత్త

కర్నూలు నుంచి   దూర ప్రాంతాలకు   బస్సు ఛార్జీలు (రూ.లలో)

కర్నూలు నుంచి ప్రధాన పట్టణాలకు ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలు (రూ.లలో)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని