logo

మహిళా రక్షణే ధ్యేయంగా పనిచేయాలి

మహిళల రక్షణే ధ్యేయంగా వార్డు, గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు పనిచేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సూచించారు. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో గ్రామ, వార్డు సచివాలయ మహిళా

Published : 02 Jul 2022 01:56 IST

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

డిక్లరేషన్‌ ఆర్డర్‌ ప్రతిని అందజేస్తున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, చిత్రంలో మంత్రి బుగ్గన,

డీఐజీ సెంథిల్‌కుమార్‌ ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : మహిళల రక్షణే ధ్యేయంగా వార్డు, గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు పనిచేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సూచించారు. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఆర్డర్‌ ప్రతుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి శుక్రవారం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మహిళలు సురక్షితంగా.. భద్రత భావంతో ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని చెప్పారు. 974 మంది కార్యదర్శులకు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేశామన్నారు. కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్‌కుమార్‌ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశా యాప్‌కు మంచి స్పందన ఉందన్నారు. ఇప్పటి వరకు 1.50 కోట్ల మంది డౌన్‌లోడు చేసుకున్నారన్నారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మాట్లాడుతూ సంకల్పంతో పనిచేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం డిక్లరేషన్‌ ప్రతులను మహిళా సంరక్షణ కార్యదర్శులకు అందించారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, అదనపు ఎస్పీ ప్రసాద్‌, డీఎస్పీలు కేవీ మహేష్‌, ఇలియాజ్‌బాషా, డీపీవో ఏవో సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని