బదిలీల సందడి
కర్నూలు (నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: కర్నూలు నగరపాలక సంస్థతోపాటు పురపాలకాల్లో బదిలీలు జరిగాయి. నంద్యాల పురపాలక శాఖలో ఎంఈగా ఉన్న రమణమూర్తిని నగరపాలక సంస్థ ఈఈగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రణాళిక విభాగంలో డిప్యూటీ సిటీ ప్లానర్‌గా ఉన్న కోటయ్యను గుంటూరు నగరపాలక సంస్థకు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస చైతన్యను తాడేపల్లి పురపాలక సంఘానికి బదిలీ చేశారు. నగరపాలక సంస్థ సెక్రటరీగా ఎస్ఎన్ లావణ్య నియమితులయ్యారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పీడీగా ఉన్న కె.రాధికను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా నియమించారు. ఏపీ సెక్రటరీలో పనిచేస్తున్న ఎస్.వెంకట రమాదేవిని కర్నూలు నగరపాలక సంస డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న పద్మావతిని తిరిగి ఎంపీడీవోగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
అటవీ శాఖలో..
కర్నూలు (నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: కర్నూలు సోషియల్ ఫారెస్టులో పనిచేస్తున్న టి.రామచంద్రారావును సూపరింటెండెంట్ హోదాలో కన్జర్వేటర్ ఫారెస్టు కార్యాలయానికి, గిద్దలూరులో పనిచేస్తున్న డి.నబీరసూల్‌ను కర్నూలు సోషియల్ ఫారెస్టు కార్యాలయానికి, నెల్లూరు నుంచి జి.చంద్రశేఖర్‌ను కర్నూలు డీఎఫ్‌వో కార్యాలయానికి నియమించారు. కన్జర్వేటర్ ఫారెస్టులో ఉన్న సి.మహమ్మద్ ఆసీన్‌ను అనంతపురంలోని చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్టుకు, కర్నూలు డీఎఫ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న టి.తిరుమల్ బాబును చిత్తూరులోని వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కార్యాలయానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరులోని చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్టు నుంచి ఎస్ఏ సుబహాన్‌ను మేనేజర్ హోదాలో కర్నూలు కన్జర్వేటర్ ఫారెస్టుకు, కర్నూలు కన్జర్వేటర్ ఫారెస్టులో పనిచేస్తున్న టి.సుజాతను గుంటూరు చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది.
డీఎస్‌ఏలో..
కర్నూలు క్రీడలు (బి.క్యాంపు), న్యూస్‌టుడే: కర్నూలు డీఎస్‌ఏలో పనిచేస్తున్న పలువురు శిక్షకులను బదిలీ చేశారు. కర్నూలు హాకీ శిక్షకుడిగా పనిచేస్తున్న సుదర్శన్, వెయిట్ లిఫ్టింగ్ శిక్షకుడు యూసుఫ్, అథ్లెటిక్స్ శిక్షకుడు వరప్రసాద్‌ను నంద్యాల డీఎస్ఏకు బదిలీ చేశారు. కర్నూలు జిమ్నాస్టిక్ శిక్షకుడు పవన్‌కుమార్‌ను వైఎస్ఆర్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విశాఖ శిక్షకుడు ఎల్.రమణ నియమితులయ్యారు. కర్నూలు ఇండోర్ స్టేడియంలో పనిచేస్తున్న గ్రౌండ్‌మెన్ భీముడు, కర్నూలుడీఎస్ఏ వాచ్‌మెన్‌గా ఉన్న సుందర్‌ను కడపకు బదిలీ చేశారు.
శ్రీశైల దేవస్థానంలో ..
శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవదాయశాఖ భారీ ఎత్తున ఉద్యోగుల బదిలీలు చేపట్టింది. గురువారం రాత్రి దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ శ్రీశైల దేవస్థానం పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం ఉద్యోగులు శ్రీకాళహస్తి, కాణిపాకం, కసాపురం, మహానంది దేవస్థానాలకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఉద్యోగులు తక్షణమే ఆయా దేవస్థానాల్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు. శ్రీశైల దేవస్థానం నుంచి బదిలీ అయిన 45 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఈవో ఎస్.లవన్న శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాయలసీమ పరిధిలోని వివిధ దేవస్థానాల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు, ఏఈలు, ఏఈవోలు, పర్యవేక్షకులు, గుమస్తాలను శ్రీశైలానికి బదిలీ చేశారు. తిరుపతి బుగ్గమఠం సహాయ కమిషనర్‌గా ఉన్న హెచ్.జి.వెంకటేష్‌కు శ్రీశైల దేవస్థానం పూర్తి బాధ్యతలు అప్పగించారు.
అహోబిలం రెగ్యులర్ ఈవోగా రామకృష్ణ
ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి ఇన్‌ఛార్జి ఈవోగా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణను రెగ్యులర్ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పాణ్యం మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రెగ్యులర్ ఈవోగా ఉంటూ అహోబిలానికి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ చేపట్టిన బదిలీల్లో ఆయన్ని రెగ్యులర్ ఈవోగా నియమించారు. అలాగే ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం జూనియర్ అసిస్టెంట్ వీరయ్య, కుమారయ్యలను అహోబిలం ఆలయానికి బదిలీ చేశారు. అహోబిలంలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ల స్థానాలు ఈ బదిలీతో భర్తీ అయ్యాయి.
అగ్నిమాపకశాఖ పరిధిలో..
కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : విపత్తు స్పందన అగ్నిమాపక శాఖకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఐదుగురు స్టేషన్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించి ప్రాంతీయ అధికారి ఇ.స్వామి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మిగనూరు స్టేషన్లో పనిచేస్తున్న వి.మోహన్‌బాబును అనంతపురం జిల్లా తాడిపత్రి స్టేషన్‌కు, అక్కడున్న అధికారి రామాంజనేయులును ఎమ్మిగనూరు స్టేషన్‌కు బదిలీ చేశారు. డోన్ స్టేషన్లో ఉన్న వి.వీరారెడ్డిని ఆళ్లగడ్డకు, చిత్తూరు జిల్లా ములకలచెరువు స్టేషన్ అధికారి గుణశేఖర్‌రెడ్డిని శ్రీశైలం స్టేషన్‌కు, అక్కడ పనిచేస్తున్న ఎం.రంగస్వామిగౌడ్ను డోన్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఏపీపీలు..
కర్నూలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే : జిల్లాలో పలువురు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురంలో ఏపీపీగా పనిచేసే బాలునాయక్‌ను కర్నూలు అడిషినల్ జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ స్థానానికి బదిలీ చేశారు. పత్తికొండలో పనిచేసే ఏపీపీ పద్మజను కర్నూలు ఎక్సైజ్ కోర్టుకు, కర్నూలు ఎక్సైజ్ కోర్టులో పనిచేసే ఏపీపీ భాస్కర్‌రావును ఆలూరు కోర్టుకు బదిలీ చేశారు. ఆలూరులో పనిచేసే విఠల్‌రావును కళ్యాణదుర్గానికి నియమించారు. బనగానపల్లిలో పనిచేసే ఏపీపీ గోపాలకృష్ణయ్యను ఎమ్మిగనూరు కోర్టుకు, ఎమ్మిగనూరులో పనిచేస్తున్న మాధవరావును బనగానపల్లికి బదిలీ చేశారు.
ఆర్టీసీ డిపో మేనేజర్లు..
కర్నూలు ఆర్టీసీ (బి.క్యాంపు), న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కె.ఎస్.ఎం.రావును విజయవాడ విద్యాపురానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. నంద్యాల డిపో మేనేజర్ సర్దార్ హుసేన్‌ను కర్నూలు-2 డిపోకు బదిలీ చేశారు. కర్నూలు-2 డిపో మేనేజర్ భాస్కర్‌ను ఎక్కడా నియమించలేదు. కర్నూలు కార్గోలో విధులు నిర్వహిస్తున్న కమర్షియల్ అసిస్టెంట్ మేనేజర్ శశిభూషణ్‌ను డోన్ డిపో మేనేజర్‌గా బదిలీ చేశారు. డోన్ డిపో మేనేజర్‌గా ఉన్న దుర్గాదేవిని పార్వతిపురం డిపోకు బదిలీ చేశారు.
ఉద్యానశాఖ అధికారిగా రామాంజనేయులు
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా ఉద్యానశాఖ అధికారి రఘునాథరెడ్డిని అనంతపురం జిల్లా డీహెచ్వోగా బదిలీ చేశారు. అన్నమయ్య జిల్లా ఏపీఎంఐపీ పీడీగా పనిచేస్తున్న రామాంజనేయులును కర్నూలు జిల్లా ఉద్యానశాఖ అధికారి (డీహెచ్‌వో)గా నియమించారు. నంద్యాల డీహెచ్‌వో బి.వి.రమణను పాడేరు ఐటీడీఏ కాఫీ ఏడీహెచ్గా బదిలీ చేయగా, ప్రకాశం జిల్లా ఏడీహెచ్ నాగరాజును నంద్యాల జిల్లా ఉద్యానశాఖ అధికారిగా నియమించారు. ఏపీఎంఐపీ ఏపీడీ సుదర్శన్‌ను సత్యసాయి జిల్లా ఏపీఎంఐపీ పీడీగా బదిలీ చేశారు.
* జిల్లా పట్టు పరిశ్రమశాఖ జిల్లా అధికారి డి.ఆంజనేయులును అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. నంద్యాల జిల్లా పట్టుపరిశ్రమ అధికారిణి పరమేశ్వరికి కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదే శాఖలో కలచట్ల సెరికల్చర్ ఆఫీసర్ నారాయణరెడ్డిని జిల్లా పట్టుపరిశ్రమ శాఖ జిల్లా కార్యాలయానికి బదిలీ చేశారు.
* ఆంధ్రప్రదేశ్ జీవిత బీమా కార్యాలయం కర్నూలు జిల్లా జేడీగా ఎం.కృష్ణను నియమించారు. గుంటూరు జిల్లా జేడీగా పనిచేస్తున్న ఆయనను కర్నూలు జిల్లాకు బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ ఇన్సురెన్సు రెడ్డి శ్రీనివాస్ ఉత్తర్వులు ఇచ్చారు.
* వ్యవసాయశాఖలో ఉమ్మడి జిల్లాలో సీనియర్ ఏఈవోలను పక్కనబెట్టి జూనియర్ ఏఈవోలను బదిలీ చేశారని ఏఈవోల సంఘం నాయకులు శుక్రవారం కలెక్టర్ పి.కోటేశ్వరరావుకు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. కలెక్టర్, జేసీ ఇద్దరూ ఆదోని వెళ్లడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.
13 మంది ఎంపీడీవోలు
కర్నూలు నగరం (జిల్లా పరిషత్), న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాలో 13 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేయగా.. నియామక పత్రాలను జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య శుక్రవారం ఆయా ఎంపీడీవోలకు అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Srilanka: బ్యాంకాక్‌లో గొటబాయ.. 24న శ్రీలంకకు తిరిగొచ్చేస్తున్నారట!
-
Crime News
Dalit Boy Death: 23రోజుల్లో 6 ఆస్పత్రులు తిప్పినా.. దక్కని బాలుడి ప్రాణం
-
Politics News
Koppula Eshwar: మంత్రి కొప్పులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
Politics News
Nitish Kumar: నీతీశ్ కేబినెట్లో72% మందిపై క్రిమినల్ కేసులు.. 27మంది కోటీశ్వరులే..!
-
Viral-videos News
Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
-
World News
Biden: దగ్గిన చేతితోనే పెన్ను ఇచ్చి, కరచాలనం చేసి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Biden: దగ్గిన చేతితోనే పెన్ను ఇచ్చి, కరచాలనం చేసి..!
- Bihar: అరెస్టు వారెంటున్న నేత.. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం..!
- Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
- Chandrababu: ఎన్నికలకు సమయం లేదు.. దూకుడు పెంచాలి: చంద్రబాబు
- Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’
- Crime news: ‘టీ’లో విషం కలిపి ముగ్గురు పిల్లలను హత్యచేసిన తల్లి
- Health tips: ఆరు రుచులతో ఆరోగ్యం.. ఈ విశేషాలు మీకు తెలుసా?
- Heart Health: చేపలతో గుండెకెంత మేలో తెలుసా..?