logo

లక్ష్మీదేవికి... సరస్వతి కటాక్షం

నిరుపేద కుటుంబం.. ఉన్నత చదువులకు కాస్త కష్టం. అయినా పట్టుదలతో చదివిన లక్ష్మీదేవి సరస్వతి కటాక్షంతో బంగారు పతకం సాధించి పలువురితో శభాష్‌ అనిపించుకున్నారు. ఆస్పరి గ్రామానికి చెందిన రామలక్ష్మి, హనుమంతు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ

Published : 02 Jul 2022 01:56 IST

ఆస్పరి విద్యార్థినికి బంగారు పతకం

ప్రసంశ పత్రాలతో లక్ష్మీదేవి

ఆస్పరి, న్యూస్‌టుడే: నిరుపేద కుటుంబం.. ఉన్నత చదువులకు కాస్త కష్టం. అయినా పట్టుదలతో చదివిన లక్ష్మీదేవి సరస్వతి కటాక్షంతో బంగారు పతకం సాధించి పలువురితో శభాష్‌ అనిపించుకున్నారు. ఆస్పరి గ్రామానికి చెందిన రామలక్ష్మి, హనుమంతు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. పెద్ద కుమార్తె లక్ష్మీదేవి ఎమ్మెస్సీ హోమ్‌ సైన్స్‌లో మానవ అభివృద్ధి శిశు సంక్షేమ అంశం పూర్తిచేశారు. 1 నుంచి పదో తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్తు పాఠశాలలో చదివారు. పదిలో మంచి మార్కులు రావడంతో ఓ ప్రైవేటు కళాశాలలో ఉచితంగా ఇంటర్‌ బైపీసీ పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీలో హోమ్‌సైన్స్‌ తీసుకుని, నాలుగేళ్ల కోర్సు చేశారు. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ రెండేళ్లు పూర్తిచేశారు. ఎమ్మెస్సీలో హోమ్‌సైన్స్‌లో మానవ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో స్పెషలైజేషన్‌ చేశారు. ఇందులో ప్రతిభ కనబరచడంతో ఇటీవలే ఎస్‌వీ విశ్వవిద్యాలయంలో బంగారు పతకం  అందజేశారు. హైదరాబాద్‌లో మనో జాగృతి సంస్థలో స్టూడెంట్‌ కౌన్సిలర్‌గా తెలంగాణలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మానసిక సమస్యలపై  కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కరోనా వల్ల విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ఆన్‌లైన్‌లో  నిర్వహించారు. లక్ష్మీదేవి చెల్లి వసంత మత్స్యశాఖలో డిప్ల్లొమా పూర్తిచేశారు. ఓ ఏడాది పాటు ప్రైవేట్‌ ఉద్యోగం చేయగా 2019లో అక్టోబర్‌లో సచివాలయంలో ఫిషరీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించారు. మరో చెల్లి మమత డెయిరీ డిప్లొమా  పూర్తిచేసింది. 2021లో సచివాలయంలో పశుసంవర్ధకశాఖలో ఉద్యోగం సాధించింది.


సీడీపీవో కావడమే లక్ష్యం..

- లక్ష్మీదేవి, బంగారు పతకం విద్యార్థి

మాది నిరుపేద కుటుంబం నాన్న వ్యవసాయం చేస్తారు. ఇద్దరు చెల్లెళ్లు  సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. మా తమ్ముడు యోగేష్‌  సైతం హ్యాండ్‌లూమ్‌ డిప్లొమా చేస్తున్నారు. మా అమ్మానాన్న కష్టం కళ్లారా చూశాను. వారికి తోడుగా నిలుస్తాను. సీడీపీవోగా ఉద్యోగం సాధించి మహిళలకు, చిన్నారులకు సేవ చేస్తాను.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని