logo

బడిని విలీనం చేయొద్దు

రాష్ట్ర ప్రభుత్వం 3, 4, 5వ తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడం విరమించుకోవాలని సీపీఎం నాయకులు మోహన్‌, పాఠశాల కమిటీ ఛైర్మన్‌ ఆంజనేయులు, కౌన్సిలర్‌ బడ్డంగిలి డిమాండ్‌చేశారు. పట్టణంలోని మెయిన్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో క

Published : 02 Jul 2022 01:56 IST

గూడూరు బస్టాండులో ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

గూడూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం 3, 4, 5వ తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడం విరమించుకోవాలని సీపీఎం నాయకులు మోహన్‌, పాఠశాల కమిటీ ఛైర్మన్‌ ఆంజనేయులు, కౌన్సిలర్‌ బడ్డంగిలి డిమాండ్‌చేశారు. పట్టణంలోని మెయిన్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం స్థానిక బస్టాండులో ధర్నా చేశారు. ఉన్నత పాఠశాలకు తరలించరాదంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల ఇంటికి దగ్గరగా ఉండడంతో రాకపోకలకు సమస్య ఉండదన్నారు. 1929 నుంచి ఎంతోమందికి విద్య నేర్పిన పాఠశాలను మార్చడం దారుణమన్నారు. విలీనం చేస్తే కిలో మీటర్ల దూరం వెళ్లడం కష్టమవుతుందన్నారు. అనంతరం మండల విద్యాధికారిణి సునీలమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, నాయకులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని