logo

రూ.70 వేలు కాజేసిన వాలంటీర్‌

రైతు భరోసా సాయం అందేలా చూస్తానని పత్రంపై వేలిముద్రలు వేయించుకున్న  వాలంటీరు మహిళ ఖాతాలో రూ.70 వేలు కాజేసిన ఘటన గడివేముల మండలం తిరుపాడులో చోటుచేసుకుంది. బాధితురాలు నాగవేణి శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు.

Published : 02 Jul 2022 01:56 IST

గడివేముల, న్యూస్‌టుడే : రైతు భరోసా సాయం అందేలా చూస్తానని పత్రంపై వేలిముద్రలు వేయించుకున్న  వాలంటీరు మహిళ ఖాతాలో రూ.70 వేలు కాజేసిన ఘటన గడివేముల మండలం తిరుపాడులో చోటుచేసుకుంది. బాధితురాలు నాగవేణి శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. ఆమె కథనం ప్రకారం..  రైతు భరోసా డబ్బులు జమ కాకపోవడంతో తిరుపాడు గ్రామ వాలంటీరు బాలమద్దులును ఆశ్రయించా. రెండ్రోజుల కిందట పత్రాలపై వేలిముద్రలు తీసుకున్నాడు.. సరిగా పడలేదని  రెండుసార్లు తీసుకున్నాడు.. ఆధార్‌కార్డు తీసుకెళ్లాడు..  తర్వాత ఖాతాలో డబ్బు డ్రా చేసినట్లు చరవాణికి సమాచారం వచ్చింది.. వెంటనే బ్యాంకుకు వెళ్లి విచారించాం.. ఎక్కడైనా వేలిముద్ర వేశావా.. ఎవరికైనా ఆధార్‌కార్డు ఇచ్చావా అని బ్యాంకు అధికారులు ప్రశ్నించారన్నారు.  వాలంటీరే   నగదు కాజేసినట్లు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.   పలు ఫిర్యాదులు రావడంతో తిరుపాడు వాలంటీరు బాలమద్దులును సస్పెండ్‌ చేసినట్లు గడివేముల ఎంపీడీవో విజయసింహారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని