logo

ఆమె మరణం చరితము

తెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణానికి చెందిన ఓ బాలింత తాను మరణించి నలుగురికి ప్రాణదాతగా మారింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణానికి చెందిన శ్రీధర్‌ ప్రైవేటు ఉద్యోగి. ఆయన సతీమణి చరిత(28)కు 20 రోజుల క్రితం మొదటి

Published : 03 Jul 2022 02:10 IST

తనువు చాలించి నలుగురికి ప్రాణదానం●

బ్రెయిన్‌డెడ్‌ అయిన బాలింత

గ్రీన్‌ ఛానల్‌ద్వారా అవయవాల చేరవేత

చరిత (పాతచిత్రం)

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణానికి చెందిన ఓ బాలింత తాను మరణించి నలుగురికి ప్రాణదాతగా మారింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణానికి చెందిన శ్రీధర్‌ ప్రైవేటు ఉద్యోగి. ఆయన సతీమణి చరిత(28)కు 20 రోజుల క్రితం మొదటి ప్రసవంలో కుమారుడికి జన్మనిచ్చారు. ఈనెల 29న విపరీతమైన తలనొప్పి రావడంతో కర్నూలు కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ చికిత్స పొందుతూ శనివారం బ్రెయిన్‌ డెత్‌ అయ్యారు. వైద్యులు సూచనతో ఆమె అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు తెలపడంతో వారు ఆ అవయవాలను గ్రీన్‌ఛానల్‌ ద్వారా ( రోడ్లపై ఎలాంటి ఆటంకం లేకుండా పోలీసుల సంరక్షణ మధ్య) గుంటూరు, నెల్లూరు పట్టణాలకు పంపించారు.

అవయవాలు తీసుకెళ్లడానికి సిద్ధంగా పోలీసులు, వైద్య సిబ్బంది​​​​​​​

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని