logo

పేదలు బతకాలంటే జగన్‌ దిగిపోవాలి

రాష్ట్రంలో పేదలు బతకాలంటే.. జగన్‌ దిగిపోవాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ.జయనాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని శివ కూడలి నుంచి

Published : 03 Jul 2022 02:10 IST

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెదేపా పోరాటం

ఆర్టీసీ బస్టాండు వద్ద తెదేపా నిరసన కార్యక్రమంలో బీవీ

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేదలు బతకాలంటే.. జగన్‌ దిగిపోవాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ.జయనాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని శివ కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. ఎద్దుల బండి ఎక్కి నిరసన తెలిపారు. బస్సు ఎక్కి ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. బీవీ మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మూడేళ్లలో అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ప్రజల పక్షాన తెదేపా పోరాడుతుందన్నారు. చెత్త పన్ను పేరుతో పింఛను సొమ్ములో కోత విధించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కొండయ్య చౌదరి, సుందరరాజు, రాందాసుగౌడ్‌, దయాసాగర్‌, ఫరూక్‌, తురేగల్‌ నజీర్‌, ముల్లాకలీముల్లా, దాదాసాహెబ్‌, మల్లికార్జున, శ్రీను, అయళ్లప్ప పాల్గొన్నారు.

ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

హుసేనాపురంలో ఆందోళన చేస్తున్న మల్లెల రాజశేఖర్‌

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: నిత్యం ప్రజలపై భారాలు మోపే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని జడ్పీ మాజీ ఛైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ పేర్కొన్నారు. శనివారం మండలంలోని హుసేనాపురంలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడ భారాలు మోపుతూ విదేశీ పర్యటనలో పాల్గొనటం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేపడుతుంటే పోలీసులు అడ్డుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలన్నీ రెట్టింపయ్యాయన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, నాయకులు రామచంద్రుడు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పల్లె ప్రయాణికులపై భారం

ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు కరపత్రాలను

అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి అన్నారు. ఛార్జీల పెంపుపై శనివారం నిరసన వ్యక్తం చేస్తూ కల్లూరు మండల పరిధి పర్ల గ్రామం నుంచి సల్కాపురం వరకు ఆమె బస్సులో ప్రయాణం చేస్తూ ప్రయాణికులకు కరపత్రాలను పంచారు. ఆమె మాట్లాడుతూ మూడేళ్లలో రూ.రెండు వేల కోట్ల ఆర్టీసీ బస్సు ఛార్జీల భారాన్ని జనంపై మోపడం దారుణమన్నారు. పల్లె వెలుగు బస్సు ఛార్జీలను భారీగా పెంచడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు రామాంజనేయులు, తిరుమలేష్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి, బీచుపల్లి పాల్గొన్నారు.

అమ్మఒడి ఇచ్చావు.. ఆర్టీసీ ఛార్జీలు పెంచావు

మాట్లాడుతున్న మంత్రాలయం తెదేపా బాద్యుడు తిక్కారెడ్డి

కౌతాళం న్యూస్‌టుడే: అమ్మఒడి ఇచ్చినట్లే ఇచ్ఛి.. వెంటనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచేశారని మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డి అన్నారు. కౌతాళం మండలం ‘మేళిగనూరు, నదిచాగి, కుంబళనూరు, హాల్వి గ్రామాల్లో శనివారం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోలు, నిత్యావసరాలు, విద్యుత్తు బిల్లులు పెంచి ఇపుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు హులిగయ్య, శ్రీనివాసరెడ్డి, చెన్నబస్సప్ప, కొట్రేష్‌గౌడ్‌, అమరేష్‌గౌడ్‌, దేవరాజ్‌గౌడ్‌, మహదేవ, నాగేశ్వరరావు, వడ్డె ఉసేని, రారావి మల్లప్పగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని