logo

హైరిస్కు గర్భిణులపై పర్యవేక్షణ అవసరం

హైరిస్కు గర్భిణులను గుర్తించి వారిని ప్రసవం అయ్యేంత వరకు క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షణ చేయడం ద్వారా మాతామరణాలు నివారించవచ్చని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామగిడ్డయ్య తెలిపారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇటీవల కోసిగి పీహెచ్‌సీ

Published : 03 Jul 2022 02:10 IST

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామగిడ్డయ్య

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: హైరిస్కు గర్భిణులను గుర్తించి వారిని ప్రసవం అయ్యేంత వరకు క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షణ చేయడం ద్వారా మాతామరణాలు నివారించవచ్చని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామగిడ్డయ్య తెలిపారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇటీవల కోసిగి పీహెచ్‌సీ పరిధిలోని సజ్జలగూడెంలో జరిగిన మాతృమరణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనస్తీషీయా వైద్యుడు కిరణ్‌ మాట్లాడుతూ గర్భిణులు క్షేత్రస్థాయిలో రక్తహీనత, రక్తపోటు, గుర్రపువాతంతో చనిపోతున్నారని, వారిని గుర్తించి పర్యవేక్షణ చేయాలని సూచించారు. గైనిక్‌ వైద్యురాలు కిరణ్మయి మాట్లాడుతూ గర్భిణులు పరీక్షలు చేసేటప్పుడు వారి కుటుంబసభ్యులు ఏఎన్‌ఎం, ఆశాలు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. సమావేశంలో జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మహేహ్వరరెడ్డి, కోసిగి వైద్యాధికారి డాక్టర్‌ మనోజ్‌, డీపీహెచ్‌ఎన్‌వో లిడియా, ఏఎన్‌ఎం, ఆశాలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని