logo

రైల్వే కార్మికుల సంక్షేమమే ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ సంకల్పం

2004 జనవరి నుంచి సర్వీసులో చేరిన రైల్వే కార్మికుల కుటుంబాలు ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాతా ఆనందంగా ఉండటమే ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ సంకల్పమని సంస్థ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య అన్నారు. శనివారం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీస్‌

Published : 03 Jul 2022 02:10 IST

మాట్లాడుతున్న మర్రి రాఘవయ్య

డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే: 2004 జనవరి నుంచి సర్వీసులో చేరిన రైల్వే కార్మికుల కుటుంబాలు ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాతా ఆనందంగా ఉండటమే ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ సంకల్పమని సంస్థ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య అన్నారు. శనివారం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో రజతోత్సవంలో భాగంగా వివిధ డివిజన్ల సంఘ్‌ నాయకులు, కార్యకర్తలతో గుంతకల్లు డివిజనల్‌ సెక్రెటరీ కె.ప్రభాకర్‌ అధ్యక్షతన రైల్వేస్టేషన్‌లో సమావేశం నిర్వహించారు. మొదట పాతబస్టాండు నుంచి రైల్వేస్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాఘవయ్య మాట్లాడారు. ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక్టర్‌ మర్రి గోవిందరాజులు, ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ సహాయ కార్యదర్శి భరణి భానుప్రసాద్‌, మార్కెట్‌ యార్డు మాజీ ఉపాధ్యక్షురాలు సరళాదేవి, డోన్‌ బ్రాంచి నాయకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పట్టణంలో ప్రదర్శన నిర్వహిస్తున్న కార్మిక సంఘం నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని