logo
Published : 03 Jul 2022 02:10 IST

ఆస్పత్రిలో అంధకారం

చరవాణి వెలుతులో మహిళకు చికిత్స చేస్తున్న సిబ్బంది 

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులు రాత్రివేళ అంధకారంలో బిక్కుబిక్కుమంటున్నారు. శనివారం రాత్రి 8 నుంచి 8:40 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో ఆకుమల్ల నుంచి విషరసాయనం తాగిన ఓ మహిళ, దొర్నిపాడు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి, మరికొంత మంది రోగులు ఆసుపత్రిలో ఉండగా అక్కడి నర్సులు, సిబ్బంది వారికి చరవాణి వెలుతురులో వైద్యసేవలందించారు. విద్యుత్తు కోతల సమయంలో ఎలాంటి ప్రత్యామ్నాయ వసతులు లేకపోవడంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆసుపత్రిలో కాన్పుల గదిలో ఒకటి, స్టాఫ్‌నర్సులుండే గదిలో మరొకటి ఇన్వెర్టులున్నా సాధారణ చికిత్సలు అందించే గదులకు కనెక్షన్‌ లేకపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచినప్పుడు అంధకారంలో విధులు చేయాల్సి వస్తోంది.  

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని