logo

ఆదోని అభివృద్ధికి కృషి చేయాలి

ఆదోని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు.

Updated : 03 Jul 2022 18:40 IST

ఆదోని మార్కెట్‌: ఆదోని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం కరవు కాటకాలతో వర్షాధారంపై ఆధారపడ్డ ఈ ప్రాంతంపై ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. ఇక్కడి పత్తి వ్యాపారానికి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అనేక సార్లు డిమాండ్లు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఐదో తేదీన ఆదోనికి వస్తున్న ముఖ్యమంత్రి ఇక్కడి సమస్యలపై స్పందించి వరాలు కురిపించాలన్నారు. లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మహానందరెడ్డి, ఈరన్న, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, గోపాల్‌, ముక్కన్న తదితరులు పాల్గొన్నారు.

‘ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాం’

ఈ నెల ఐదో తేదీన ఆదోనికి వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను వ్యతిరేకిస్తున్నామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రభుత్వ ఇంటర్‌, డిగ్రీ, పీజీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. ఇక్కడి ప్రాంతవాసుల మనోభావాలను దెబ్బతీసిన ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చాకే పర్యటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోహన్‌, రాజు, వీరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని