logo

తటాకం కాదు.. తారు రోడ్డు

ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ముందే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు వర్షాలకు గుంతలమయంగా మారిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బనగానపల్లి నుంచి అవుకు వెళ్లే ప్రధాన రహదారి దారుణంగా మారింది. అవుకునకు 3 కిలోమీటర్ల దూరంలో రోడ్డు చూడటానికే భయంకరంగా ఉంది.

Published : 07 Aug 2022 01:28 IST

ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ముందే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు వర్షాలకు గుంతలమయంగా మారిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బనగానపల్లి నుంచి అవుకు వెళ్లే ప్రధాన రహదారి దారుణంగా మారింది. అవుకునకు 3 కిలోమీటర్ల దూరంలో రోడ్డు చూడటానికే భయంకరంగా ఉంది. గతంలో అధికారులు ఇక్కడ వంతెన నిర్మాణానికి రోడ్డును తవ్వి కంకర పోసి వదిలేశారు. దాంతో వర్షాలకు కుంటలను తలపిస్తోంది. ఈ రోడ్డుపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రోడ్డు నుంచి నంద్యాల, తాడిపత్రి, బెంగళూరు, విజయవాడ, కాకినాడ, శ్రీశైలం, అనంతపురం ఇలా ప్రధాన నగరాలకు బస్సులు వెళ్తుంటాయి. దారికి మరమ్మతులు చేసి ప్రయాణికుల కష్టాలు తీర్చాలని పలువురు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, బనగానపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని