logo

కానిస్టేబుల్‌ దారుణ హత్య

ఓ కానిస్టేబుల్‌ను కిడ్నాప్‌ చేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటన నంద్యాల పట్టణంలో ఆదివారం రాత్రి 10.30 దాటాక చోటు చేసుకుంది. నంద్యాల పోలీసులు, ఆటో డ్రైవర్‌ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ గూడూరు సురేంద్రకుమార్‌

Published : 08 Aug 2022 03:31 IST

 కిడ్నాప్‌ చేసి హతమార్చిన దుండగులు

సురేంద్ర (పాత చిత్రం)

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: ఓ కానిస్టేబుల్‌ను కిడ్నాప్‌ చేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటన నంద్యాల పట్టణంలో ఆదివారం రాత్రి 10.30 దాటాక చోటు చేసుకుంది. నంద్యాల పోలీసులు, ఆటో డ్రైవర్‌ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ గూడూరు సురేంద్రకుమార్‌ (35) క్లర్క్‌గా పనిచేస్తున్నారు. అతను ఆదివారం రాత్రి డీఎస్పీ కార్యాలయం నుంచి మోటారు సైకిల్‌పై ఇంటికి వెళుతున్నారు. రాజ్‌ థియేటర్‌ సమీపంలో ఆరుగురు వ్యక్తులు అతడిని అటకాయించారు. అక్కడే ఉన్న ఓ ఆటోలో బలవంతంగా ఎక్కించారు. ఆటో డ్రైవర్‌పై కత్తి పెట్టి నంద్యాల శివారులోని చెరువు కట్టపైకి తీసుకెళ్లి కత్తితో గుండెలపై, వీపులో పొడిచారు. అదే ఆటోలో పట్టణంలోకి తిరిగివస్తూ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని డ్రైవర్‌కు చెప్పి మధ్యలో దిగి పరారయ్యారు. ఆటో డ్రైవర్‌ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సురేంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న ఎస్పీ రఘువీర్‌రెడ్డి, డీఎస్పీ మహేశ్వరరెడ్డి అక్కడికి చేరుకున్నారు. పోలీసులకే రక్షణ లేకుంటే ఎలా బతకాలని కుటుంబసభ్యులు విలపించారు. ఘటానా స్థలాన్ని ఎస్పీ, డీఎస్పీ పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరా పుటేజీలను చూశారు. ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హంతుకులు రౌడీషీటర్లేనా..
కానిస్టేబుల్‌ హత్యకు రౌడీషీటర్లే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో జరిగిన హత్యలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చారన్న అనుమానంతో సురేంద్రను కిడ్నాప్‌ చేసి అతి దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. హంతకులు ఆరుగురు ఉన్నారని.. వారందరూ రౌడీషీటర్లనేనా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వరుస హత్యలకు పాల్పడినవారే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని