logo

న్యాయవాది హత్య కేసులో 10 మంది అరెస్టు

ములుగు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇప్పటి వరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ పోలీసు ఏఆర్‌ హెడ్‌

Published : 08 Aug 2022 03:31 IST

 నిందితుల్లో ముగ్గురు కర్నూలు, నంద్యాల జిల్లా వాసులు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌, చిత్రంలో నిందితులు

ములుగు, న్యూస్‌టుడే: ములుగు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇప్పటి వరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ పోలీసు ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన గోనెల రవీందర్‌, హనుమకొండకు చెందిన పిండి రవియాదవ్‌, ములుగు మండలం కొడిశల కుంటకు చెందిన వంచ రామ్మోహన్‌రెడ్డి హత్యకు సూత్రధారులు. పథకాన్ని అమలు చేయడానికి వరంగల్‌ జిల్లా నారక్కపేటకు చెందిన తడక రమేష్‌ వారికి సహకరించాడు. ఈ నలుగురిని ఈనెల 5న అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారిలో హనుమకొండ జిల్లా గంగిరేణి గూడేనికి చెందిన పెరుమాండ్ల రాజు, పెరుమాండ్ల రాకేష్‌, వరంగల్‌ జిల్లా నారక్కపేటకు చెందిన వైనాల శివ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు జిల్లా కొక్కెరంచకు చెందిన ఈడిగ వేణు, ఈడిగ జయరాం, నంద్యాల జిల్లా పాములపాడుకు చెందిన బుక్కా వెంకటరమణలకు హత్యతో సంబంధాలున్నాయని నిర్ధారించి అరెస్టు చేశారు. హత్య చేయడానికి రూ.18 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. హత్యకు సంబంధించి ఇంకా కొంతమంది నిందితులున్నారని ఎస్పీ స్పష్టం చేశారు. వారిని గుర్తించామని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని