logo

9 నెలల చిన్నారికి శస్త్రచికిత్స

తెలంగాణ రాష్ట్రానికి చెందిన జిస్మిత అనే 9 నెలల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు సర్వజన వైద్యశాల పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ శివకుమార్‌, సర్జన్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అడ్వాన్స్‌ ల్యాప్రోస్కోపిక్‌ నెఫ్రాక్టమీ శస్త్రచికిత్స ద్వారా కుడి

Published : 08 Aug 2022 03:31 IST

జిస్మితతో పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ శివకుమార్‌, సర్జన్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌రెడ్డి

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రానికి చెందిన జిస్మిత అనే 9 నెలల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు సర్వజన వైద్యశాల పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ శివకుమార్‌, సర్జన్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అడ్వాన్స్‌ ల్యాప్రోస్కోపిక్‌ నెఫ్రాక్టమీ శస్త్రచికిత్స ద్వారా కుడి మూత్రపిండం తొలగించి చిన్నారి ప్రాణాలు కాపాడినట్లు ఆదివారం తెలిపారు. గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన చిన్నారి కుడి మూత్రపిండం పూర్తిగా పాడైపోవడంతో గతనెల 17న పీడియాట్రిక్‌ విభాగంలో చేరిందని తెలిపారు. గతనెల 29న శస్త్రచికిత్స ద్వారా మూత్రపిండాన్ని తొలగించినట్లు తెలిపారు. ఈనెల 5న చిన్నారిని డిశ్ఛార్జి చేశామన్నారు. శస్త్రచికిత్సలో పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ శివకుమార్‌, వైద్యులు గ్రేసి, నరేశ్‌, అనస్తీషియా వైద్యుడు హరికృష్ణ పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని