logo

ఇళ్ల పట్టాలు అందించాలని ఎమ్మెల్యేకు వినతి

ఆదోని పట్టణం 19వ వార్డులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజలు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిపై సమస్యల ప్రశ్నలు సంధించారు. ప్రధానంగా ఇళ్లస్థలాల

Updated : 08 Aug 2022 20:18 IST

ఆదోని మార్కెట్‌: ఆదోని పట్టణం 19వ వార్డులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజలు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిపై సమస్యల ప్రశ్నలు సంధించారు. ప్రధానంగా ఇళ్లస్థలాల సమస్యలను వివరించారు. మొత్తం వార్డులో 600 మంది ఇళ్ల పట్టాలకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 100మందికి మాత్రమే పట్టాలు వచ్చాయని వార్డు కౌన్సిలర్‌ చలపతి వివరించారు. దీంతో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తుండగా ప్రజలు ఇళ్ల స్థలాలపై ఏకరవు పెట్టారు. ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి.. 90 రోజుల్లో పట్టాల జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, పురపాలక ఛైర్‌పర్సన్‌ శాంత, మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ మహబూబ్‌ బాషా, వైస్‌ ఛైర్మన్‌ తిమ్మప్ప, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts