logo

ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోవాలి

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారశైలి సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, ఆయనపై ఆగస్టు 15లోగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. 

Published : 10 Aug 2022 01:49 IST

మాట్లాడుతున్న సోమిశెట్టి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారశైలి సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, ఆయనపై ఆగస్టు 15లోగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటనను ప్రజలు చూడలేదన్నారు. దేశమంతా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను జరుపుకొంటుండగా.. వైకాపా ఎంపీ ఇలాంటి సిగ్గుమాలిన పని చేశారని, దీనిని కప్పిపుచ్చేందుకు.. ప్రజల దృష్టి మరల్చేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి సజ్జలకు లేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అర్ధరాత్రి సంగతి దేవుడెరుగు.. పట్టపగలు.. మిట్టమధ్యాహ్నం కూడా మహిళలు, యువతులు, బాలికలు రోడ్లపై తిరిగే పరిస్థితి లేదన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని